30.7 C
Hyderabad
May 12, 2024 23: 25 PM
Slider ఖమ్మం

విభజన హామీలు అమలు చేయాల్సిందే

separation guarantees must be enforced

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని సి‌పి‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎం‌ఎల్‌ఏ  కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ల పరిధిలోనే నెలకొండపల్లి, గార్ల, గూడూరు  ప్రాంతాలలో అపారమైన ఖనిజ సంపద వున్నదని వెల్లడించారు. బయ్యారం ప్రాంతంలో ఉక్కు కర్మాగారం పెడతామని విభజన సమయంలో కేంద్రం హమీ ఇచ్చి, దానిపై నేటికీ  నిర్ణయం తీసుకోకపోవటం దారుణమన్నారు .  గతంలో 1.40 లక్షల  ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం రక్షణ స్ట్రీల్స్ కు లీజు కు ఇచ్చిందన్నారు. వారు లక్షల కోట్ల ఖనిజ సంపదను తరలించుకు పోతున్న సమయంలో సి‌పి‌ఐ అడ్డుపడి అనేక ఆందోళనలు చేసిందన్నారు . దీనిపై 2010 జూలై 11 న అసెంబ్లి లో సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు . తమ ఆందోళనల  ఫలితంగా అప్పటి లీజును ప్రభుత్వం రద్దు చేసి , విభజన సమయంలో  బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం హామీ ఇచ్చిందన్నారు . బయ్యారం లో 300 మిలియన్ టన్నుల ఖనిజ సంపద వున్నదని , వెంటనే అక్కడ ఉక్కు కర్మాగారం నిర్మించాలన్నారు . ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 9 వ తేదీన  బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు  పేరుతో  నిరాహారదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు . హైదరాబాద్ లో ఈ దీక్ష కు ప్రజల నుంచి మద్దతు వస్తుందని వెల్లడించారు . బయ్యారం లో ఉక్కు కర్మాగారం సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కూనంనేని స్పష్టం చేశారు .

Related posts

సమన్వయంతో ముందుకు సాగుదాం

Satyam NEWS

ఓటర్ల జాబితాలో అవకతవకలు సవరించాలి

Bhavani

గ్రూప్ 1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Satyam NEWS

Leave a Comment