29.7 C
Hyderabad
May 7, 2024 06: 51 AM
Slider ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే

ys jagan 44

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బందని, దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని అందువల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి కోరారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడంవల్ల ఆయన సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ వాదనలు వినిపించింది. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, అందుకే అప్పుడు అరెస్టు చేశామని, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, అధికారులంతా ఆయన చెప్పినట్లు వినాల్సి ఉంటుందని, ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వవద్దన్న సుప్రీం కోర్టు సూచనను సీబీఐ న్యాయవాది న్యాయస్థానం ముందు ఉంచారు. గతంలో కూడా వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని సీబీఐ పేర్కొంది. తర్వాత జగన్ హైకోర్టును ఆశ్రయించారని అక్కడ కూడా ఈ పిటిషన్‌ని న్యాయస్థానం డిస్మిస్ చేసిందన్నారు. ఇప్పుడు ఆయన సీఎం అయ్యారన్న ఏకైక కారణంతో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అప్పటికీ, ఇప్పటికీ కేవలం పరిస్థితులు మారాయని, నేరంలో ఎలాంటి మార్పు జరగలేదన్న విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Related posts

ఆర్టికల్ 370 ఎఫెక్ట్: మంచు కొండల్లో తగ్గిన హింస

Satyam NEWS

రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయండి

Satyam NEWS

President election: ఫలితం ముందే తెలిసిన పోరాటం

Satyam NEWS

Leave a Comment