శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, ఫిబ్రవరి నెల కోటాలో మొత్తం 69,512 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆన్‌లైన్ డిప్ విధానంలో 10,112 సేవా టికెట్లు ఉన్నాయి. ఇందులో సుప్రభాతం 7,332, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2300 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో జనరల్ కేటగిరిలో 59,400 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జితబ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకారసేవ 16,800 టికెట్లు ఉన్నాయి. అదే విధంగా భక్తుల సౌకర్యార్థం 2020 ఫిబ్రవరి నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 5న టిటిడి విడుదల చేయనుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
previous post