అక్టోబర్ 31 అర్ధ రాత్రి దాటిన తర్వాత అంటే నవంబర్ 1 ప్రవేశించిన క్షణం నుంచి మన దేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. ఈ విషయం ఇప్పుడా చెప్పేది. మాకు ఎప్పుడో తెలుసు అనుకుంటున్నారా? అప్పుడే అనుకోవద్దు. మొత్తం చదవండి. అంతకు ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో 29 రాష్ట్రాలు ఉండేది. తెలంగాణ 29వ రాష్ట్రం. అయితే ఆర్టికల్ 370 రద్దు చేసే సమయంలో జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్, లద్దాక్ అనే రెండు భాగాలుగా విడదీసి ఆ రెంటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు. దాంతో దేశంలో రాష్ట్రాల సంఖ్య ఒకటి తగ్గి 28 రాష్ట్రాలుగా మారింది. ఈ మేరకు భారత దేశం కొత్త మ్యాప్ విడుదల అయింది. అంతవరకూ బాగానే ఉంది. అన్ని రాష్ట్రాలూ కరెక్టుగానే ఉన్నాయి. అయితే ఒక చిన్న లోపం ఉంది. ఆ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో లేదు. అన్ని రాష్ట్రాల రాజధానులను స్పష్టంగా ఉన్న మ్యాప్ లో ఏపికి మాత్రం రాజధాని లేకుండా చేశారు. ఏపి రాజధాని అమరావతి కాదా? అమరావతి రాజధానుల జాబితాలో లేదా? అస్సలుకే లేదా తాజాగా తీసేశారా? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? లేక కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదా? అసలు ఈ మ్యాప్ తయారు చేసిన మ్యాప్స్ ఆఫ్ ఇండియా వారికి ఏపికి రాజధాని లేదని చెప్పింది ఎవరు? ఎవరినీ అడగకుండా వారే ఏపికి రాజధాని లేదని వారే నిర్ణయం తీసుకున్నారా? ఈ మొత్తం ఎపిసోడ్ కు బాధ్యులు ఎవరు?
previous post