37.2 C
Hyderabad
May 6, 2024 15: 00 PM
Slider మహబూబ్ నగర్

నేరాల అదుపునకు.. నిఘా నేత్రాలు ఉపయోగకరం

ప్రజలకు రక్షణ, భద్రత లక్ష్యంగా నేరాల అదుపు కోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ మరియు ప్రజల భాగస్వామ్యంతో 1,555 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎస్పీ మరియు డిజిపి కార్యాలయాలకు అనుసంధానం చేసి నేటి నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పీ కె. మనోహర్ తో కలిసి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల కిడ్నాప్, హత్యలు, అల్లర్లు, ఆందోళనల సమాచారాన్ని విజువల్స్ సహా క్షణాల్లో సమాచారం అందుతోందన్నారు. దీంతో నేరగాళ్ల కదలికలే కాకుండా జరిగిన సంఘటన గురించిన సమాచారం, నిందితుడు వెళ్లిన దారిని గుర్తించేందుకు పోలీసులకు ఏలాంటి కేసులనైనా ఛేదించేందుకు వీలు కలుగుతోందని, సిసి కెమెరాల్లో విజువల్స్ రికార్డింగ్‌తో చాలా పెద్ద కేసులే పరిష్కారమయ్యాయన్నారు.

జిల్లాలోని ప్రజలందరూ తమ తమ ఇల్లు, కార్యాలయం లేదా సొంత స్థలాన్ని సురక్షితంగా, నిఘాలో ఉంచేలా సీసీ కెమెరాలు చక్కటి పరిష్కారం చూపుతాయి అన్నారు. జిల్లా ఎస్పీ కే మనోహర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం నేటి నుంచి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా గుర్తించి ఎవరైనా వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, అనుమతి లేని చోట వాహనాలు పార్కింగ్ చేయడం గుర్తించి వారిపై ఈ ఛానల్ నమోదు చేయబడతాయని ఎస్పీ వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 1555 సీసీ కెమెరాల విజువల్స్ ను నేరుగా డీజీపీ కార్యాలయంలో వీక్షించే లా అనుసంధానం చేయబడిందని వెల్లడించారు.
నేరాల అదుపు చేసేందుకు సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి అదనపు ఎస్పీ రామేశ్వర్ రావు టౌన్ డీఎస్పీ మోహన్ కుమార్, ఏఆర్ డిఎస్పి దీపక్ చంద్ర, సీఐలు, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, నాగర్ కర్నూలు జిల్లా

Related posts

పెరిగిన వేతనాలు తక్షణమే ఇవ్వాలి: సిఐటియు డిమాండ్

Satyam NEWS

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం

Satyam NEWS

జగనన్న జోరుకు బాలినేని బ్రేక్

Satyam NEWS

Leave a Comment