29.7 C
Hyderabad
May 1, 2024 03: 58 AM
Slider నల్గొండ

కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి: సి ఐ టి యు

ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని సోమవారం పనులు బందు చేసి గేటు ముందు ఆందోళనకి దిగిన కార్మికుల న్యాయమైన కోర్కెలను తక్షణమే పరిష్కరించాలని వారికి మద్దతుగా సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి డిమాండ్ చేసినారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం రామాపురం లోని ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందు జరిగిన కార్మికుల ఆందోళనలో పాల్గొన్న శీతల రోషపతి మాట్లాడుతూ ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టర్ యాజమాన్యం మెకానికల్, సివిల్,ఎలక్ట్రికల్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని,ప్రక్కనే ఉన్న జువారి ఫ్యాక్టరీలో ఇస్తుండగా ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో అతి తక్కువ వేతనం ఇస్తున్నారని,కార్మికుల శ్రమ దోపిడీ సంవత్సరాల నుండి చేస్తుందని ఆరోపించారు.వారి న్యాయమైన కోరికలు తక్షణమే పరిష్కరించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యుయేటూ ఇవ్వాలని,బోనస్ ఇవ్వాలని,అందరికీ పి ఎఫ్ కట్టాలని, 26 రోజులు పని చేసిన వారికి నెల వేతనం ఇవ్వాలని,కార్మికుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని,క్యాంటీన్లో సౌకర్యం కల్పించాలని,కార్మికులకు యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్మికుల న్యాయమైన హక్కులు పరిష్కరించాలని, లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని,కార్మికులు ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రామాపురం సర్పంచ్ మైల మల్లికార్జున్ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని అన్నారు.

మెకానిక్,ఎలక్ట్రిషన్, సివిల్ లలో పనిచేసే కార్మికులు ఒక కమిటీగా ఎన్నికైంది.కమిటీ సభ్యులుగా వి.నాగేశ్వరరావు, పి.రామకృష్ణ,బి.నాగేంద్రబాబు, టి.నాగేశ్వరరావు,ఎస్ కె.జానీ, జానకిరామారావు, కమిటీ సభ్యులుగా శంకర్ గోవింద్, రామారావు, గిరిప్రసాద్, కాంతారావు,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

విజయనగరంలో తగ్గిన పోలీసు “స్పందన” బాధితుల సంఖ్య

Satyam NEWS

మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

Satyam NEWS

అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి కౌన్సిలర్ అండ

Satyam NEWS

Leave a Comment