28.7 C
Hyderabad
May 6, 2024 09: 42 AM
Slider విజయనగరం

ప్రయాణీకుల భద్రతకు భరోసా….సీసీ కెమారాలు

#SPRajakumari

ప్రయాణికుల భద్రతకు, ఆర్.టి.సి కాంప్లెక్స్ లో నేరాలను, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు విజయనగరం పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమారాలను ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ  రాజకుమారి తెలిపారు.

విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, విజయనగరం తిరుమల హాస్పిటల్ ఎమ్.డి డా.తిరుమల ప్రసాద్, స్వస్తిక్ ఫుడ్స్, కేతల స్టీల్స్ సహకారంతో సుమారు రెండు లక్షల యాభై వేల వ్యయంతో విజయనగరం ఆర్.టి.సి కాంపెక్స్ లో 32 అధునాతన సీసీ కెమెనాలపే ఈ సీసీ కెమారాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  రాజకుమారి హాజరై, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమును ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – నేరాలను, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు జరిగిన నేరాలను డిటెక్ట్ చేసేందుకు నిఘా నేత్రంలాగా ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు.

టెక్నాలిజికల్ సర్వే లైన్స్ తో అతి త్వరగా నేరాలను చేధించేందుకు కెమెరాలు ఉపయోగపడతాయన్నారు.

జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండే అన్ని నగరాలకు బస్సులు వెళతాయిని, వివిధ కార్యకలాపాలకు ప్రజలు, వ్యాపారస్తులు, విద్యార్ధులు, ఉద్యోగులు ప్రయాణిస్తుంటారని, బస్సులు ఎక్కే సమయంలో పాకెట్ పికిటింగ్ లు, బ్యాగుల్లో డబ్బు పోవడం, బ్యాగులు మాయం కావడం, మెడలో బంగారు ఆభరణాలు దొంగిలింపబడటం వంటి నేరాలు జరుతున్నాయని, సీసీ కెమారాలు ద్వారా నిఘా పెట్టడం వలన ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించి, వారిలో ఆత్మ హైరాన్ని నింపుతామన్నారు.

కాంప్లెక్స్ లో ఉన్న 25 ప్లాట్ ఫారంల వద్ద, ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారాల వద్ద మొత్తం 32 సీసీ కెమారాలను ఎ.పి.పబ్లిక్ సేఫ్టీ చట్టంలో భాగంగా ఏర్పాటు చేసామన్నారు.

సీసీ కెమారాలతో నిత్యం పర్యవేక్షణ

ఇంతకు ముందు ఉన్న 8 కెమెరాలతో పాటుగా 40 సీసీ కెమారాలతో నిత్యం పర్యవేక్షణలో ఉంటుందన్నారు.

ఈ కెమెరాల్లో ఐదు ఫేస్ డిటెక్షన్ కెమెరాలు ఉన్నాయని, ఈ కెమెరాల ద్వారా ఎవరైనా పాత నేరస్థులు కాంప్లెక్స్ ఆవరణలోనికి ప్రవేశించినట్లైతే వెంటనే సీసీ కెమారాలు అనుసందానించబడిన పోలీసు అధికారిని అప్రమత్తం చేస్తూ మెసేజ్ వస్తుందన్నారు.

రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1500 సీసీ కెమారాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక నుండి ప్రయాణికులు నిర్భయంగా ప్రయాణం కొనసాగించేందుకు సీసీ కెమెరాల నిఘా భరోసాగా ఉంటందన్నారు.

సీసీ కెమారాల ఏర్పాటు చేయడంలో స్వచ్చందంగా ముందుకు వచ్చి సహకరించిన తిరుమల హాస్పిటల్ ఎమ్.డి డా.తిరుమల ప్రసాద్, స్వస్తిక్ ఫుడ్స్, కేతల స్టీల్స్ వారికి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసు శాఖకు సహకరించి సీసీ కెమారాలు అమర్చడంలో సహకరించిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎ. అప్పలరాజు , వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్టీసీ కాంప్లెక్స్ లో సీసీ కెమారాలు అమర్చడానికి కృషి చేసిన విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, 1వ నగర సీఐ జె. మురళి, 2వ నగర సీఐ శ్రీనివాసరావు మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

సీసీ కెమెరాలు కొనుగోలు చేసేందుకు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా సహకరించిన తిరుమల హాస్పిటల్, స్వస్తిక్ ఫుడ్స్, కేతల స్టీల్స్ ప్రతినిధులకు జిల్లా పోలీసు శాఖ తరుపున జ్ఞాపికలను బహూకరించారు.

అనంతరం, ఆర్టీసి కాంప్లెక్స్ లోని ప్రయాణికులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఉచితంగా మాస్కులను, సేనిటైజర్లను పంపిణీ చేసి కోవిడ్ జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, ఆర్టీసీ రీజనల్మే నేజర్ ఎ.అప్పలరాజు, విజయనగరం 1వ నగర సీఐ జె.మురళి, 2వ నగర సీఐ సి. హెచ్. శ్రీనివాసరావు, రూరల్ సీఐ టి.ఎస్.మంగవేణి, ఆర్టీసీ అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రయాణీకులు పాల్గొన్నారు.

Related posts

పెద్దపాడు ఉన్నత పాఠశాలలో ఘనంగా న్యూ ఇయర్

Satyam NEWS

సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

Satyam NEWS

కొల్లాపూర్ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

Leave a Comment