29.7 C
Hyderabad
May 4, 2024 03: 43 AM
Slider ముఖ్యంశాలు

సీసీఐ పునర్ ప్రారంభానికి జిల్లా ప్రజలు ఉద్యమించాలి

#veerayya

ఆదిలాబాద్ జిల్లాలోని ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) భూములను  కాపాడాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. వీరయ్య  డిమాండ్ చేశారు. పార్టీ ప్రతినిధి బృందంతో CCI భూములను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకి తలమానికంగా వెలుగొందిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI పరిశ్రమను పునః ప్రారంభించాలని. CCI సాధన సమితి పేరుతో CPM ఇతర పార్టీలు ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని ఒకవైపు పోరాటం చేస్తున్నాము. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమను యంత్రాలను భవనాలను  తృప్పు కింద అమ్మేయాలని టెండర్లు పిలిచింది దాన్ని కూడా అడ్డుకున్నాం. పరిశ్రమ ప్రారంభం అవుతే జిల్లా అభివృద్ధికి సోపానంగా మారుతుందని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

మరోవైపు భూ భకాసురులు CCI పరిశ్రమ భూములను కాజేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. పరిశ్రమకు ప్రభుత్వ భూమి 800 ఎకరాలు లీజు భూమి 1200 ఎకరాలు ఉండగా నేడు ఆ భూములను కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు. మరోవైపు భూములలో అక్రమంగా లేఅవుట్లు వేస్తూ  వ్యాపారం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఈ భూములలో ఇన్ని అక్రమాలు జరుగుతున్న CCI అధికారులు జిల్లా కలెక్టర్ చూసి చూడనట్లు వ్యవహరించడం భావ్యం కాదు. పరిశ్రమ భూములు అంటే ప్రజల ఆస్తి అన్యాక్రాంతమవుతున్న పట్టించుకోకపోవడం శోచనీయం అని మండిపడ్డారు.ప్రజాప్రతినిధుల అండదండలతోనే భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ భూములను పరిరక్షించడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించకపోతే వారి హస్తం కూడా ఇందులో ఉందని ప్రజలు భావిస్తారు. కావున అన్యాక్రంతం అవుతున్న పరిశ్రమ భూములను పరిరక్షించాలని అక్రమ లేఔట్లు వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమను పునః ప్రారంభించాలని, కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .లేనిపక్షంలో రానున్న రోజుల్లో ప్రజలను రైతులను ఐక్యం చేసి  CCI భూముల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  CPM పార్టీ రాష్ట్ర కమిటిసభ్యులు బండారు రవి కుమార్  cpm పార్టీ జిల్లా కార్యదర్శి  దర్శనాల మల్లేష్ CPM పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు,అన్నమొల్ల కిరణ్. జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న ,M. గంగన్న, రైతు సంఘం నాయకులు లోకరీ పోశెట్టి ,డి .వెంకన్న ,kvps నాయకులు జి .స్వామి ,భూనిర్వాసితుల సంఘం నాయకులు అరవింద్, ఈశ్వర్ దాస్ ,రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు .

Related posts

తెలుగుదేశం పార్టీ గెలవడంతో వైసీపీ ఏం చేసిందో తెలుసా?

Satyam NEWS

ఎస్ఐ దాష్టీకం.. మహిళపై దాడి..

Sub Editor

చినజీయర్ స్వామిపై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Sub Editor 2

Leave a Comment