విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు శ్రీ పంచమి కావడంతో దక్షిణామూర్తి స్వామి ఆలయ ప్రాంగణంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఉత్తరాధికారి సరస్వతి స్వామి ఉత్సవాలు మొదలుపెట్టారు. ముందుగా రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు ఒడిస్సా గవర్నర్ సూర్యనారాయణ పాత్రో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదేవిధంగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శరగడం చిన అప్పలనాయుడు, వైసిపి నాయకులు నక్క కనకరాజు, ఎల్ బి నాయుడు, ఎం వెంకటరమణ, దాసరి రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏసీపీ స్వరూప ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.