31.7 C
Hyderabad
May 2, 2024 07: 36 AM
Slider నిజామాబాద్

బీడీ కార్మికులకు డబులు బెడ్ రూమ్ లు ఇవ్వాలి

#jukkal

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని గ్రామ బీడీ కార్మికులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సి ఐ టి యు జిల్లా కమిటి సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం లోని జుక్కల్, బిచ్కుంద,మద్నూర్,  పుల్కల్ గ్రామాల బీడీ కార్మికులందరికి ఇండ్ల స్థలాలు, డబులు బెడ్ రూమ్ లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీడీ కార్మికులకు ఇండ్ల స్థలాలు, డబులు బెడ్ రూమ్ లను ఇవ్వాలని కోరుతూ బీడీ కార్మికులు ఎమ్మెల్యే స్వగృహం లో విన్నవించగా అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం తో బీడీ కార్మికుల తరపున ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. దీంతో పాటు అర్హులైన బిడి కార్మికులకు పెన్షన్ మంజూరు కోరుతూ పి ఎఫ్ నంబర్ ఉన్న ప్రతి బీడీ కార్మికులందరికి ఆసరా పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారందరూ ప్రతి మండల కేంద్రాల్లోని ఎంపి డి ఓ కార్యాలయల్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడం జరిగిందని కాని వారికి నేటివరకు ఎలాంటి పెన్షన్ మంజూరు చెయ్యలేదని అన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పి ఎఫ్ నంబర్ కలిగి ఉన్న ప్రతి బిడి కార్మికులకు ఆసరా పెన్షన్ లను మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు. అనంతరం సమావేశం సందర్బంగా జుక్కల్ మండల బిడి కార్మికుల నూతన కమిటి ని ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన కమిటి సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ కమిటి అధ్యక్షురాలుగా చంద్రకళ,ప్రధాన కార్యదర్శి యు.సులోచన,ఉపాధ్యక్షురాలిగా మోతె సునీత,కోశాధికారి డి. భాగ్యలక్ష్మి,సహాయ కార్యదర్శి మోతె ప్రియాంక , తోపాటు రుక్మిణి, స్వరూప, నిర్మల, రామాదేవి, లక్ష్మి బాయి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కార్యక్రమం లో బిడి కార్మికులందరు పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జూకల్ నియోజకవర్గం

Related posts

ట్రంప్ చెత్త పాలనను ఎండగట్టిన పెంటగాన్ మాజీ అధికారి

Satyam NEWS

పకడ్బందీగా పరీక్షలు

Murali Krishna

అన్న‌దాత‌ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment