30.7 C
Hyderabad
April 29, 2024 05: 26 AM
Slider నిజామాబాద్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ డైమాండ్, వివేకానంద వారి ఆధ్వర్యంలో అక్యుప్రెషర్ చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎంపీపి అశోక్ పటేల్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ డైమండ్ అధ్యక్షులు ఓం ప్రకాశ్ మాట్లాడుతూ మందులు లేకుండా కింద పేర్కొనబడిన వ్యాధులకు చికిత్సలు వారం రోజుల పాటు నిర్వహిస్తామన్నారు.ఊబకాయమూ, కీళ్లనొప్పులు, పక్షవాతం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మానసిక వ్యాధులు,శిరోవేదన, నిద్రలేమి, మూత్రపిండాల వ్యాధి, నడుమునొప్పి, మధుమేహము,అజీర్ణము, శ్వాసకోశ వ్యాధులు, పిల్లలు నిద్రలో మూత్రం పోయిటం, రక్తపోటు, గొంతు,చెవి సమస్యలు,మెడ నొప్పి, సయాటికా, ముక్కు ,మోకాళ్ల నొప్పులు,మూత్రపిండాల్లో రాళ్లు తదితర వ్యాధులకు చికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు.

ప్రతి వ్యక్తికి పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు చికిత్స చేపడతామని రిజిస్ట్రేషన్ రుసుము ఆరు రోజులకు గానూ వంద రూపాయలు వసూలు చేయబడతాయన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ తో పాటు మార్కెట్ కమిటి అధ్యక్షులు మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు శ్రీహరి, డైమండ్ లయన్స్ అధ్యక్షులు ఓంప్రకాశ్ ,జావేద్,డాక్టర్ రాజు, వివేకానంద లయన్స్ క్లబ్ అధ్యక్షులు సురేష్, శంకర్గౌడ్,శ్రీనాథ్,వైద్యులు రాజ్పుత్ డిఏటీ, ఎస్కే సింగ్, ఎమ్మెస్ బిష్నోహి తదితరులు ఉన్నారు.

జుక్కల్ సత్యం న్యూస్

Related posts

‘దాన కర్ణుడు’ సోను సూద్ పెన్సిల్ చిత్రం

Satyam NEWS

Over The Counter What Is The Quickest Way To Lower Your Blood Sugar Alternative Medicines For Metformin

Bhavani

పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు

Satyam NEWS

Leave a Comment