40.2 C
Hyderabad
May 2, 2024 16: 10 PM
Slider హైదరాబాద్

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ పై చిత్త శుద్ధి లేదు: రాగిడి లక్ష్మారెడ్డి

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు చిత్త శుద్ధి లేదనీ ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట నూనె, గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణ చేయటం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.దీంతో ప్రజలపై తీవ్రమైన భారం పడుతోందని అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉప్పల్ మాజి మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, నాచారం డివిజన్ ఇంఛార్జి మేడల మల్లికార్జున్ గౌడ్, హబ్సిగూడ డివిజన్ ఇంఛార్జి సుధాకర్ రెడ్డి, రామంతపుర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎండీ రాఫిక్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పత్తి కుమార్ ,ఎక్స్ ఐ వై సీ కోర్డినేటర్ వినోద్ ముదిరాజ్ , రామంతపుర్ డివిజన్ ఇంఛార్జి తవిడబోఇన గిరి బాబు, జిల్లా ఎస్ టి సెల్ చైర్మన్ గణేష్ నాయక్ ,జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కారిపే సంతోష్, ఉప్పల్ ఓబిసి చర్మెన్ పుప్పాల వెంకటేష్, లతో కలిసి ఉప్పల్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధరలను నియంత్రించే చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కాంటెస్టడ్ కార్పొరేటర్ డివిజన్ ఇంఛార్జి లు ప్రెసిడెంట్ లు , మహిళా కాంగ్రెస్ యన్ స్ యూ ఐ యూత్ కాంగ్రెస్ ఎస్ టి ఎస్సీ మైనార్టీ సేవాదళ్ నాయకులు , సంజయ్ జైన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బూర్గుల రమేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కల్పన రెడ్డి, మహిళా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జామిల బేగం, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మంజుల రెడ్డి, రేణుక చిలుక నగర్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి,మల్లాపూర్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ మున్నీ బేగం, మాలు నాయక్, నవీన్ రెడ్డి, ఫాసిఉద్దిన్, గ్యారా కిరణ్,రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

రన్ రాజా రన్: ముందుగా మూడింది ఉప శాఖలకు

Satyam NEWS

పాలన చేతకాక ధర్నాలకు దిగుతున్నారా?

Satyam NEWS

ఫండ్స్ ప్రాబ్లమ్: పేటలో నిఘా నేత్రాలు కనుమరుగు

Satyam NEWS

Leave a Comment