27.7 C
Hyderabad
May 4, 2024 09: 27 AM
Slider ప్రత్యేకం

జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు ఇక చెల్లవు

#raghurama

షాక్ లపై షాక్ లు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, వై ఎస్ జగన్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్ తన సొంత పేర్లు పెట్టుకోవడంపై వివరణ కోరింది. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న పోషణ్‌ అభియాన్ వంటి పథకాలకు రాష్ట్రాలు తమకు నచ్చిన పేర్లు పెట్టుకోవడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.

కేంద్ర పథకాలకు ఏపీలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు అని పేర్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

రఘురామ ఫిర్యాదుపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.2021-22కి సంబంధించి ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌ పథకాలకు ఇచ్చిన రూ.187 కోట్ల లెక్క చూపాలని ఇందులో ఇరానీ కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకునపడింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు మార్చిన పేర్లు, వాటి కోసం తీసుకున్న చర్యలపై ఓ నివేదిక పంపాలని ఆదేశించినట్లు ఎంపీ రఘురామరాజుకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.

దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటిపై వివరణ ఇవ్వాల్సి ఉంది. వాస్తవానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచీ కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చి తమవిగా చెప్పుకుని అమలు చేసుకోవడంపై బీజేపీ మండిపడుతూనే ఉంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ అదే పరిస్ధితి కొనసాగుతుందని బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఈ విమర్శల్ని పట్టించుకోవడం లేదు. దీంతో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రంగంలోకి దిగారు. ఆయన లేఖకు మాత్రం కేంద్రం స్పందించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Related posts

అధునాతన మట్టి పాత్రల తయారీ యంత్రాలు పంపిణీ

Satyam NEWS

అనారోగ్యంతో ములాయం రెండో భార్య మృతి

Satyam NEWS

అధికార పార్టీలోకి మారి రెండేళ్లు….అభివృద్ధి మాత్రం శూన్యం…

Satyam NEWS

Leave a Comment