40.2 C
Hyderabad
May 2, 2024 18: 30 PM
Slider మహబూబ్ నగర్

మందు దుకాణం పై ఆగ్రహించిన మహిళా లోకం

#wineshop

కల్వకుర్తిలో మందు దుకాణం తెరవడం పై మహిళా లోకం ఆగ్రహించింది. మద్యం షాపుల యజమానుల గుండెలు దద్దరిల్లాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నేషనల్ థియేటర్ లో మద్యం దుకాణం తెరవడం పై గాంధీ నగర్ కాలనీలోని మహిళలు ధర్నాకు దిగి దుకాణం తెరువ కూడదని షాపు యజమాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాసం ఉండే చోట మద్యం దుకాణం ఎలా తెరుస్తారని తెరిచిన దుకాణాన్ని మూసివేయించి తాళం వేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఫిర్యాదు చేశామని వారు చెప్పే వరకు తేరువకూడదని తాళాలు తీయకూడదని హెచ్చరించారు.

గతంలో ఈ  మద్యం దుకాణం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణకు ఎదురుగా ప్రభుత్వ గ్రంధాలయం పక్కన ఉండేది.కాగా కొన్ని సంవత్సరాలుగా అధికారుల పై ఒత్తిడి చీఫ్ సెక్రెటరీ కార్యాలయం ఎదుట ధర్నా చేసి, కల్వకుర్తి కి వచ్చిన కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ , భేతాళ విక్రమార్కుడు వలె పట్టు విడవక స్వామి వివేకానంద సేవ బృందం అలుపెరుగని పోరాటం చేయడంతో అక్కడి నుండి ఈ దుకాణాన్ని కాళీ చేశారు. విద్యాలయాలు, గ్రంథాలయాలు ఉన్నచోట నిబంధనలకు విరుద్ధంగా ఈ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని గతంలో సామాజిక కార్యకర్తలు అధికారుల దృష్టికి తీసుకువచ్చి అలిసిపోయారు. కానీ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే విధంగా స్వామి వివేకానంద సేవ బృందం పోరాటం విద్యార్థుల భవిష్యత్తు నిలబెట్టాయి. కాగా ఇక్కడ ఖాళీ చేయించిన మద్యం దుకాణాలు థియేటర్లో నూతనంగా పురుడు  పోసుకోవడానికి ప్రయత్నించిగా గాంధీనగర్ మహిళలు అడ్డుకున్నారు.

Related posts

దక్షిణాఫ్రియాపై టీమిండియా ఘన విజయం

Satyam NEWS

మార్చి 14 నుండి తిరుమలలో ఫాల్గుణ మాస ఉత్స‌వాలు

Satyam NEWS

ఘనంగా విజయనగరం ప్రభుత్వ సంగీత కళాశాల 103వ వార్షికోత్సవం

Satyam NEWS

Leave a Comment