38.2 C
Hyderabad
May 3, 2024 22: 30 PM
Slider గుంటూరు

హైవే ముట్టడికి అడ్డుకట్ట: డాక్టర్ చదలవాడ గృహనిర్బంధం

chadalavada

నేడు విజయవాడ నుండి చెన్నై , జాతీయ  రహదారి ముట్టడి ఉన్న నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జాతీయ రహదారి ముట్టడికి భారీ సంఖ్యలో కార్యకర్తలను సమీకరణ చేసిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆయన ఇంటి నుంచి కదలకుండా నిర్భంధించారు. గత కొద్ది రోజులుగా ఆయన గుంటూరు జిల్లా మొత్తం తిరిగి జన సమీకరణకు చర్యలు తీసుకున్నారు. రాజధాని అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వస్తే రహదారి ముట్టడి కార్యక్రమానికి వేలాదిగా పల్నాడు రైతులు తరలివస్తారనే ఉద్దేశ్యంతో ఆయనను పోలీసులు గృహనిర్భంధం చేశారు.

ప్రభుత్వం మూడు రాజధాని ప్రకటన విరమించే అంతవరకు పోరాటం ఆగదని, ప్రభుత్వం పోలీసులు అడ్డంపెట్టుకుని, ఉద్యమాన్ని అణిచి వేస్తుందని చదలవాడ పేర్కొన్నారు.

Related posts

హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఎడిషన్‌ జక్‌ జ్యువెల్స్‌ ఎక్స్‌పో

Satyam NEWS

అందరికి ఆమోదయోగ్యమైన రీతిలోనే రైలు మార్గం

Bhavani

తెలంగాణలో జనవరి నుండి పాఠశాలలను ప్రారంభించాలి

Satyam NEWS

Leave a Comment