39.2 C
Hyderabad
May 4, 2024 22: 10 PM
Slider నల్గొండ

తెలంగాణలో జనవరి నుండి పాఠశాలలను ప్రారంభించాలి

#PRTUNalgonda

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తేదీ నుండి పాఠశాలలను ప్రారంభించాలని పి ఆర్ టి యు జిల్లా శాఖ అధ్యక్షుడు సుంకరి బిక్షం గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

నల్గొండ జిల్లా నకరేకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం జరిగిన యూనియన్ మండల శాఖ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ పాఠశాలలను నడపాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే విషయంలో పి ఆర్ టి యు ముందంజలో ఉందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 83 వేల సభ్యత్వాలు కలిగి బలమైన  ఉపాధ్యాయ సంఘంగా వెలుగొందుతుంది అని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పిఆర్సి పదోన్నతులు వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు .పి ఆర్ టి యు డిమాండ్ చేస్తున్న విధంగా 43 శాతం పిఆర్సి నీ  ఆమోదించాలని, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయులు పి ఆర్ టి యు వెంట ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని బిక్షం గౌడ్ ఉపాధ్యాయులను కోరారు. ఈ సమావేశానికి మండల శాఖ అధ్యక్షుడు బాదం బిక్షపతి అధ్యక్షత వహించగా రాష్ట్ర అసోసియేటెడ్ మాజీ అధ్యక్షుడు వెంకట రమణ రాష్ట్ర కమిటీ సభ్యులు,

చొక్కారపు  విజయ్ కుమార్, జిల్లా అసోసియేటెడ్ సభ్యులు, ఫణికుమార్ మండల కార్యదర్శి, రేబల్లె శరత్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.

Related posts

సోము వీర్రాజు అభిమాని ఆత్మహత్యాయత్నంతో అలజడి

Satyam NEWS

ఆదాలకు ముస్లిం నేతల ఘన సన్మానం

Satyam NEWS

యాదాద్రికి పోటెత్తిన భక్తులు…

Satyam NEWS

Leave a Comment