29.7 C
Hyderabad
May 3, 2024 04: 16 AM
Slider తెలంగాణ

హైకమాండ్ టెస్టింగ్: రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష

revanth-reddy

మునిసిపల్ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షపదవి నుంచి తప్పుకుంటానని ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లుగా భావిస్తున్నా ఆయన ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రాలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మూడు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న తర్వాత జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమి పాలైన నాటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. సీనియర్ నాయకులు పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నట్లు ఎక్కువ కామెంట్ లు వస్తున్నాయి. భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ఒప్పందం కుదిరి తదుపరి పిసిసి అధ్యక్షుడుగా కోమటిరెడ్డిని ఎక్కించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నారు.

 అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలని క్యాడర్ నుండి వస్తున్న తరుణంలో ఇదే విషయాన్ని ఢిల్లీలో ఉన్న సోనియా కూడా గుర్తించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత పగ్గాలు రేవంత్ రెడ్డి చేతిలో పెట్టడానికి సోనియాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు, బిజెపి పార్టీ నేతల కు ఇతర నాయకులకు గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా తెలంగాణ కాంగ్రెస్ లో మంచి చరిష్మా ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి కి మంచి పేరు ఉండటంతో సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి అందుతున్న సమాచారం.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ స్థానికంగా అక్కడ ప్రజల బాధ్యతలను వారి బాధలను సమస్యలను తెలుసుకుంటూ మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి పరిమితం అయ్యారు. రేవంత్ రెడ్డికి పార్టీ పీసీసీ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నా సోనియాగాంధీ తన పార్లమెంటు నియోజకవర్గంలో, అదే విధంగా సొంత నియోజకవర్గం కొడంగల్ లో మున్సిపాలిటీలను కార్పోరేషన్ లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా ఫలితాలు సాధిస్తే కచ్చితంగా టీపీసీసీ పదవిని రేవంత్ రెడ్డి కే ఇవ్వాలని సోనియా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Related posts

నరసరావుపేటలో ఘనంగా గోపూజ ఉత్సవం

Satyam NEWS

గజిటెడ్ అధికారుల డైరీ ఆవిష్కరించిన సిఎం కేసీఆర్

Satyam NEWS

కరోనా కోరల నుంచి బయటపడిన అమితాబ్ బచ్చన్

Satyam NEWS

Leave a Comment