40.2 C
Hyderabad
April 28, 2024 18: 42 PM
Slider నల్గొండ

అభివృద్ధికి ఆదర్శంగా ఆదర్శంగా నిలవడమే ధ్యేయం

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని మున్సిపాలిటీ మూడో వార్డులో మున్సిపల్ నిధుల నుండి వార్డుల వారిగా కేటాయించిన నిధులతో సీసీ డ్రైనేజ్ ని వార్డు ప్రజలు, తోటి కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి సోమవారం  ప్రారంభించారు.

ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాలిటీలో మూడో వార్డు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

త్వరలో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు,మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ నిధుల నుండి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ప్రణాళికలు ఇప్పటికే  పంపి ఉన్నామని,త్వరలో ఆ నిధులను కూడా వార్డులో సిసి డ్రైనేజ్, రోడ్డు నిర్మాణాలు చేపట్టనున్నట్లు సంపత్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,జిల్లా డిసిసిబి డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,,23వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్,పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,పెద్దబ్బాయి,వేముల నాగరాజు,వేముల వెంకన్న,వెల్దండ వీరారెడ్డి,ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షుడు రామరాజు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రమౌళి, బెంజిమెన్,రామ్మూర్తి,షేక్.సైదా,మాజీ కౌన్సిలర్ కంకణాల పుల్లయ్య, వల్లపుదాసు కృష్ణ,చింతకాయల రాము,పట్టణ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు యెహోనా,సులువ చంద్రశేఖర్,మహిళా నాయకురాలు శివ పార్వతి, హుజూర్ నగర్ వేణుగోపాలస్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ జగన్నాథచార్యులు,మూడో వార్డు ప్రజలు గుండా భద్రయ్య,సుశీల,శంభి రెడ్డి,కొండలు,నాగేశ్వరరావు,సోమా చంద్రశేఖర్,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, రామిశెట్టి శ్రీనివాస్,తాటి జనార్దన్ రెడ్డి, గుడిపాటి అనిల్ రాధిక,చారి,పాశం నాగిరెడ్డి,మూడవ వార్డ్ యూత్ సభ్యులు నాగరాజు,శశి, సాయి,నవీన్, వంశీ,చందు,శివ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

Satyam NEWS

వండర్: వెలికి వచ్చిన క్రీస్తు కాలం నాటి శిథిల నౌక

Satyam NEWS

లేబర్ ఆఫీసర్ ను హత్య చేసిన టీఆర్ఎస్ నాయకుడు

Satyam NEWS

Leave a Comment