30.2 C
Hyderabad
May 13, 2024 11: 52 AM
Slider కృష్ణ

దిశ యాప్ ఎక్కడ?: చంద్రబాబు

#chandrababu

మానసికస్థితి సరిగా లేని యువతిపై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన గ్యాప్ ఘటన ఎపికే అవమానం అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన చాలా దారుణమైనది…అందరూ సిగ్గుపడాల్సిన విషయం అన్నారు.

ఒకఆడబిడ్డ ను మోసంచేసి, ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి,  ఒకగదిలోబంధించి, 30గంటలపాటు ముగ్గు రు వ్యక్తులు అత్యాచారం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ కు గురైన యువతిని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చంద్రబాబు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

బాధిత మహిళ చెప్పింది వింటే కడుపు తరుక్కుపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురువ్యక్తులు ముప్పైగంటలపాటు ఆ యువతి పై  సామూహిక అత్యాచారం చెయ్యడం తీవ్ర వేదనకు గురిచేసింది అన్నారు. ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుందో లేదో తెలియదుగానీ, ప్రజలమనిషిగా, ప్రతిపక్షనాయకుడిగా నేను నిజంగా సిగ్గుపడు  తున్నాను అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ముఖ్యమంత్రి  ఈరోజు సున్నావడ్డీకోసం ప్రకాశంజిల్లాకు వెళ్లాడు…ముఖ్యమంత్రి వెళ్లాల్సింది అక్కడికికాదు.. నేరుగా బాధితురాలు చికిత్సపొందుతున్న ప్రభుత్వాసుపత్రికి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. నేరుగా ఇక్కడికి వచ్చి బాధితురాలిని పరామర్శించాలి అన్నారు.సిఎం కనీసం పరామర్శకు కూడా రాకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు.

సిఎం వచ్చి రాష్ట్రంలోని మహిళలందరికీ ఒకభరోసా కల్పించేలా వ్యవహరించిఉంటే, నేనుకూడా మెచ్చుకునే వాడిని. బాధితురాలి తండ్రి తనకుమార్తె కనపడటంలేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదుచేస్తే, నీకూతురు ఎక్కడుందో తండ్రినే వెతుక్కోమని  చెబుతారా? అంటూ చంద్రబాబు మండి పడ్డారు. ఆఖరికి గత్యంతరంలేని పరిస్థితుల్లో తనకుమార్తెను వెతుక్కుంటూ తండ్రేనేరుగా బంధువులతోకలిసి ఆసుపత్రికి వెళ్లాడు.

అక్కడ దారుణ పరిస్థితి చూసి అప్పటికప్పుడు ఆవేశంతో అందరూ తలుపులుబద్దలుకొట్టి, గదిలోకి వెళ్లారు. ఇంతజరిగితే అదంతా ఈప్రభుత్వానికి అవమానంకాదా? పరిపాలించే అర్హత మీ ప్రభుత్వానికి ఉందా.. అసలు మీకు సిగ్గుందా అని బాధతో ప్రశ్నిస్తున్నాను అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటుదూరంలో యువతిపై కాబోయే భర్తముందే అత్యాచారం చేస్తే ఆదుర్మార్గుల్ని పట్టుకున్నారా? వారిని శిక్షించారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కారు కావాలని కుటుంబాన్నినడిరోడ్డుపై వదిలేసి కారుతీసుకెళతారా? ఏమంటారుదాన్ని. కండకావరమనాలా…లేక ఉన్మాదమనాలా? అని ప్రకాశం జిల్లా ఘటనపై కూడా చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎవరి ఆస్తులకు, ఆడబిడ్డల మానప్రాణాల కు రక్షణలేదని…. ఆడబిడ్డలమానప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి బయటకురారని దుయ్యబట్టారు.

దేశంలో ఎక్కడగంజాయి, ఇతరమాదకద్రవ్యాలు పట్టుబడినా, రాష్ట్రం పేరే వినిపిస్తోందని…రాష్ట్రంలో గంజాయి, జేబ్రాండ్ మద్యం, డ్రగ్స్ వాడకంపెరగబట్టే, ఆడబిడ్డలపై ఇలాంటిదారుణాలు ఎక్కువవుతున్నాయని చంద్రబాబు అన్నారు. దిశాచట్టం తెచ్చామని….. ఆడబిడ్డలను ఉద్ధరిస్తున్నామని చెప్పారు.

లేని దిశాచట్టంతో శిక్షలు వేస్తు న్నామంటున్నారు. మీకు నిజంగా నిజాయితీ…చిత్తశుద్ధిఉంటే, విజయవాడ ఆసుపత్రిలో జరిగినదారుణంపై విచారణకోసం ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టండి. కేసు విచారణ వేగంగాజరిపి ముగ్గురికి ఉరిశిక్షలు వేయించండి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇలాంటి ఘటనలపై సామాన్య ప్రజలు కూడా గొంతెత్తి మాట్లాడాలని చంద్రబాబు అన్నారు. కేసులకు బయపడి మౌనంగా ఉంటే..రేపు మీ ఇంట్లో కష్టం వచ్చినా ఎవరూ స్పందిచరని అన్నారు. బాధిత యువతికి టిడిపి నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. యువతికి ప్రభుత్వఉద్యోగం ఇవ్వాలని…..కోటి రూపాయల పరిహారం ప్రభుత్వం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Related posts

ఆర్ధిక పరిస్థితిపై ఆందోళనతో రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆత్మహత్య

Satyam NEWS

25 న విజయనగరం జెడ్‌పి ఛైర్మ‌న్ ఎన్నిక‌… ఏర్పాట్లు ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

Satyam NEWS

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన వైద్య బృందం

Satyam NEWS

Leave a Comment