29.7 C
Hyderabad
May 6, 2024 04: 54 AM
Slider కృష్ణ

సీఆర్‌డీఏ పరిధిలో అభివృద్ధి ప్రణాళికల్లో సవరణలు

amaravathi 22

సీఆర్‌డీఏ పరిధిలోని పలుచోట్ల భూ వినియోగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. ఈ మేరకు ఆరు ప్రాంతాల జోనల్‌ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాలో చేసిన మార్పులను ఆమోదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని పలుచోట్ల భూ వినియోగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. ఈ మేరకు ఆరు ప్రాంతాల జోనల్‌ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాలో చేసిన మార్పులను ఆమోదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఏయే జోనల్‌ ప్రణాళికలో ఎలాంటి మార్పులకు ఆమోదం తెలిపారంటే

తాడేపల్లి జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళికలోని కొలనుకొండలో డోర్‌ నంబరు 6/1బీ, 1సీ, 7(పీ)లో 8,361.25 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని వ్యవసాయ ప్రాంతాన్ని నివాస అవసరాలకు వినియోగించేందుకు అనుమతించారు.

మంగళగిరి: ఆత్మకూరులో డోర్‌ నంబరు 393/2ఏ, 2బీలో 4,004.98 చ.మీ నివాస ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేందుకు అనుమతి.

కానూరు: పోరంకిలో ఆర్‌ఎస్‌ నంబరు 453/1సీ (పీ), 453/1డీ (పీ), 453/1ఈ (పీ)లో 520.23 చ.మీ స్థలంలో ప్రజా అవసరాల కోసం ప్లానులో గుర్తించిన స్థలాన్ని నివాస అవసరాలకు వాడుకునేలా అనుమతించారు.

తెనాలి: జయప్రకాశ్‌నగర్‌ టౌన్‌ సర్వే నంబర్లు 647(పీ)లోని 616.84 చ.మీ స్థలాన్ని ప్రజావసరాల నుంచి నివాస అవసరాలకు మళ్లించారు.

గన్నవరం: ఆత్కూరులో ఆర్‌ఎస్‌ నంబరు 1/2(పీ)లోని 26,755.53 చ.మీ. స్థలాన్ని వ్యవసాయ ప్రాంతం నుంచి నివాస అవసరాలకు బదలాయించారు.

గొల్లపూడి: నివాస ప్రాంతంగా గుర్తించిన గొల్లపూడిలోని ఆర్‌ఎస్‌ నంబరు 495/2ఏ(పీ)లోని 994.54 చ.మీ విస్తీర్ణాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేందుకు అనుమతి.

Related posts

ఆరోగ్య సూత్రాలతో కోటప్పకొండ గిరిప్రదక్షిణ

Satyam NEWS

దీపావళి నాడు చేయాల్సిన పనులు ఇవి

Satyam NEWS

జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Bhavani

Leave a Comment