28.7 C
Hyderabad
May 6, 2024 00: 18 AM
Slider ముఖ్యంశాలు

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

#policepreeti

కామారెడ్డి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 394 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ మహరాజ్ విగ్రహాలు ఉన్న గ్రామాలలో వేడుకలను జరిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శివాజీ జయంతి వేడుకలను ఆర్యక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘ భవనం నుంచి విగ్రహం వరకు ర్యాలీగా చేరుకుని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పోరాట పటిమ, ఆయన చేసిన సేవలను కొనియాడారు.

మహిళలు కూడా పాల్గొనాలి: డిగ్రీ విద్యార్థిని పోలీస్ ప్రీతి

వచ్చే సంవత్సరం శివాజీ జయంతి వేడుకలలో మహిళలు కూడా పాల్గొనేలా చూడాలని డిగ్రీ విద్యార్థిని పోలీస్ ప్రీతి ఆర్యక్షత్రియ సభ్యులను కోరడంతో అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సానుకూలంగా స్పందించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె  ముందుగా అందరిని గుండెపై చేయి వేయించి శివాజీ శ్లోకాన్ని అనర్గళంగా వినిపించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం లాంటి ఆరు గుణాలు కలిగి సాక్షాత్తు భవాని మాత వీరఖడ్గం పొంది గమ్యం, గమనం, హిందుత్వ నినాదాన్నిచ్చిన ఛత్రపతి శివాజీ మహరాజ్ హిందూ సామ్రాట్ గా గొప్ప పేరు పొందరన్నారు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఆర్యక్షత్రియ బంధువులంతా ఒకచోట కలుస్తున్నామని తెలిపారు.

శివాజీ ఇంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన తల్లి జిజియామాత మహిళ అని, కానీ జయంతి వేడుకల్లో మగవాళ్లే కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం శివాజీ జయంతి వేడుకలలో మహిళలు పాల్గొనేలా చూడాలని ఆమె సంఘ సభ్యులను కోరడంతో సానుకూలంగా స్పందించారు. అంతమందిలో తన మనసులోని మాటను ధైర్యంగా బయటపెట్టడంతో అమ్మాయిని సంఘ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యక్షత్రియ సంఘం అధ్యక్షుడు నిట్టు రవీందర్ రావు, ఉపాధ్యక్షుడు చిన్నోళ్ల శంకర్ రావు, సహాయ కార్యదర్శి రఘుపతి, అర్జున్ రావు, నిట్టు వెంకట్ రావు, పోలీస్ కృష్ణాజిరావు, కాసర్ల స్వామి, లింగారావు, శివాజీ రావు, మహంత్ మచాలే బాబా, మనోహర్ రావు, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీవేత్త గురజాడ

Satyam NEWS

పిలిచి మంత్రి పదవి ఇస్తే అన్యాయం చేశారు

Satyam NEWS

వచ్చేనెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు

Satyam NEWS

Leave a Comment