31.7 C
Hyderabad
May 7, 2024 01: 34 AM
Slider విజయనగరం

ఏటీఎంల వద్ద మోసంతో డబ్బు దొంగిలించిన నిందితుడి అరెస్టు…!

#ATM thief

ఈజీ మనీ ఎలా సంపాదించాలో తెలుసుకున్నాడు..ఆ యువకుడు. చేతిలో డబ్బులకై పక్కా పధకం వేసాడు.

ఏటీఎం లలో డబ్బులు విత్ డ్రా చేసేందుకు వచ్చిన వృద్ధులను మోసం చేసి వారి ఏటీఎం కార్డును మార్చి తనవద్ద ఉన్న పనిచేయని కార్డును వారికి ఇచ్చి, ఏటీఎం పిన్ నెంబరు వారి వద్ద నుండే తెలుసుకొని మోసం చేసి డబ్బులు అవహరిస్తున్నాడు ఈ నిందితుడు.

అతడిని విజయనగరం రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొన్నట్లుగా విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్లితే…. విజయనగరం మండలం, మలిచర్లకు చెందిన పి.కృష్ణారావు, ఆంధ్రాబ్యాంకు ఏటీఎం సెంటరులో తన కుమార్తె ఎటిఎం కార్డు నుండి నగదు తీసేందుకు వెళ్ళగా, అక్కడ ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు విత్ డ్రా చేస్తానని చెప్పి నమ్మించి తన వద్ద ఏటీఎం కార్డు తీసుకున్నాడని చెప్పాడు.

కార్డు పనిచేయలేదని చెప్పి తనకి కార్డుని తిరిగి ఇచ్చివేసినట్లు, కొన్ని నిమషాల తర్వాత తన కుమార్తె ఏటీఎం కార్డునుండి 20 వేలు విత్ డ్రా చేసినట్లు తన కుమార్తె ఫోనుకు 3 మెసేజ్ లు వచ్చినట్లు, సదరు గుర్తు తెలియని వ్యక్తి తనను మోసం చేసిన విషయం తెలిసింది.

తనకు వేరొక పనిచేయని ఎటిఎం కార్డు ఇచ్చివేసి, తన కుమార్తె ఎటిఎం కార్డును తీసుకొని డబ్బులు దొంగతనంగా విత్ డ్రా చేసినట్లు విజయనగరం రూరల్ పీఎస్ నందు ఫిర్యాదు చేశారు.

సదరు ఫిర్యాదు పై విజయనగరం రూరల్ ఎస్ఐ పి.నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా బ్యాంకు నుండి వివరాలు సేకరించి, సదరు కార్డునుండి విజయనగరం ఆర్.టి.సి కాంప్లెక్స్ లో ఉన్న ఎటిఎం సెంటరు నుండి రెండు సార్లు, మయూరి జంక్షన్ వద్ద ఉన్న ఏటీఎం సెంటరు  నుంచీడబ్బులు విత్ డ్రా చేసినట్లు గుర్తించారు.

అక్కడ ఉన్న సీసీ కెమారా ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని గుర్తించి, ఇటీవల కాలంలో ఆర్.టి.సి కాంప్లెక్స్ లో అమర్చబడిన సీసీ కెమారాలలో నిందితుడు వేసుకొన్న డ్రెస్ ఆధారంగా నిందితుడు వెళ్తున్న బైక్ నెంబరు గుర్తించారు.

పోలీసు ఈ చాలాన్ ఏప్ ద్వారా నిందితుడు చిరునామా విశాఖపట్నం, కొమ్మాది అని గుర్తించి, తక్షణం విజయనగం రూరల్ ఎస్ఎ నారాయణరావు మరియు అతని సిబ్బంది వెంటనే ఇరవై ఐదేళ్ల నిందుతుడు పేడాడ చినబాబును అదుపులోనికి తీసుకొన్నారు.

అతడిని విచారించగా, ఇంతకు ముందు విజయనరగం 1వ పట్టణ పరిధిలో ఈ ఏడాది 3వనెల, 5వ నెల, ఇటీవలే జరిగిన, ఏటీఎం లనుండి డబ్బులు తీస్తానని చెప్పి వృద్ధులను మోసగించినట్లు ఒప్పుకున్నాడు.

ఏటీఎంఎం కార్డులు మార్చి కోట జంక్షన్ లో దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్లలో ఒక సారి 17500/-,మరో సారి 20,000/-,ఇంకొకసారి 20,000/- ఇలా మొత్తం 75,000/-లు మోసం చేసి వృద్ధులను టార్గెట్ చేసి విత్ డ్రా చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నట్లు తెలియజేశారు.

నిందితుడు ఈజీమనీకి అలవాటు పడి ఏటీఎంలకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసి డబ్బులు తీసేందుకు సహాయ పడతానని చెప్పి మోసం చేసి వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డులను మార్చి తన వద్ద ఉన్న పనిచేయని ఎటిఎం కార్డులను ఇచ్చి పిన్ నెంబరు వారివద్దనుండే తెలుసుకొని మోసం చేస్తున్నట్లుగా చెప్పారు.

నిందితుడు పేడాడ చినబాబు పై విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో కూడా ఇదేతరహా కేసులు ఉన్నట్లుగా చెప్పారు.

ఈ కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన విజయనగరం రూరల్ సీఐ మంగవేణి, ఎస్.ఐ పి.నారాయణరావు, సిబ్బంది ఏఎస్ఎ త్రినాథరావు, ఏసి షేక్ షఫిలను విజయనగరం డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సదర్భంగా డీఎస్పీ అనిల్ కుమార్ మాట్లాడుతూ – ఎటిఎం సెంటర్లుకు డబ్బులు విత్ డ్రా చేసేందుకు వృద్ధులను ఒంటిరిగా పంపించవద్దని, వరిచయం లేని వ్యక్తులకు ఏటీఎం కార్డులను ఇవ్వడం గాని పిన్ నెంబర్లు చెప్పడం గాని చేయవద్దని, అలాగే ఫోన్స్ లో వచ్చే ఫే కాల్ష్ కు రెస్పాండ్ అయి ఎవ్వరికీ ఓటీపీలు ఏటీఎం కార్డు నెంబర్లు, సీవీవీ నెంబర్లు చెప్పవద్దన్నారు….. డీఎస్పీ  అనిల్ కుమార్.

Related posts

టిఆర్ఎస్ తాలూకా యూత్ అధ్యక్షుడిగా అమర్ నాథ్

Satyam NEWS

కరోనా బాధితులకు పండ్లు పంపిణీ చేసిన సీపీఎం జిల్లా కమిటీ

Satyam NEWS

అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి

Satyam NEWS

Leave a Comment