40.2 C
Hyderabad
April 26, 2024 11: 03 AM
Slider వరంగల్

కరోనా బాధితులకు పండ్లు పంపిణీ చేసిన సీపీఎం జిల్లా కమిటీ

#CPMMulugu

ములుగు మండలం లోని ఇంచెర్ల గ్రామ పంచాయతీ పరిధి ఎర్రగట్టమ్మ  వద్ద ఏర్పాటు చేసిన కరోనా బాధితుల వసతి గృహాన్ని నేడు సీపీఎం ములుగు జిల్లా కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్బంగా వారు భాదితులతో మాట్లాతూ కరోనాతో భయపడ కుండా దైర్యంగా ఉండాలని అన్నారు.

కరోనా సెంటర్ లొ ఉన్న యాభై మంది బాధితులకు రొటీన్ కూరగాయలు పెడుతున్నారని, మెనూ ప్రకారం ఇవ్వాల్సిన డ్రైఫుడ్స్, బిస్కెట్స్, పాలు ఇవ్వడంలేదని అన్నారు. రోజుకు రెండూ సార్లు పాలు ఇవ్వాలని రోజు కూరగాయలు ఓకే రకమైన వికాకుండా పెట్టాలని అన్నారు

ఈ సందర్బంగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్యకి కరోనా బాధితులకు అందాల్సిన సౌకర్యలపై అక్కడి నుండే ఫోన్లో చెప్పారు. ఆయన అక్కడి హోటల్ మేనేజర్ తో మాట్లాడి పౌష్టికాహారం అందిస్తానని అన్నారు. వారానికి ఒకసారి కరో నా సెంటర్ ను అధికారులు సందర్శించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో గుండెబోయిన రవిగౌడ్, గుట్టమీది ముసలయ్య, ఆలయ ప్రచారకార్యదర్శి  గుండ మీది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Related posts

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజ్: మంత్రి కెటిఆర్ ని బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

20న హైదరాబాద్ జిల్లాస్థాయి TRS పార్టీ సమావేశం

Satyam NEWS

సీఎం కప్ పోటీలు ప్రారంభం

Bhavani

Leave a Comment