37.2 C
Hyderabad
May 6, 2024 12: 05 PM
Slider మహబూబ్ నగర్

మున్సిపాలిటీలో డిసిల్ దోపిడిని అరికట్టండి

#prajavani

వనపర్తి జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం లో వనపర్తి మున్సిపాలిటీలో డిసిల్ దోపిడీ గురించి, డబ్బుల మాయం గురించి, రిజిస్టర్ కార్యాలయం గురించి వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాషకు వినతిపత్రం అందజేశామని అఖిలపక్ష

 ఐక్యవేదిక  నాయకులు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ మున్సిపాలిటీతో రోడ్లు ఉడ్చడానికి తెచ్చిన స్వీ పింగ్ మిషన్  ఒక వివాదం అనీ, అది వచ్చినప్పుడు పలు ఆరోపణలు వచ్చాయని దాన్ని తెచ్చి మూలకు పెట్టారని అఖిలపక్ష ఐక్యవేదిక పోరాటం చేసిందన్నారు.

అలా మూలకు పడ్డ స్విపింగ్ మిషన్ కు 2021 నుండి ఇప్పటివరకు 9 లక్షల 90 వేల రూపాయలు డిజిల్ బిల్లు చేసుకున్నారని, నిన్న పత్రికలో ప్రచురితం అయ్యాయని,దానిపై విచారణ చేయించి దోషులను శిక్షించి డబ్బులు రికవరీ చేయాలని కోరారు. గతంలో తిరుమల్ రెడ్డిని ఉపయోగించుకుని చాలామంది జనరల్ ఫండ్ దోచుకున్నారని వారిని అందరిని విచారించాలని డిమాండ్ చేశారు. వనపర్తి ఊరికి బయట ఏర్పాటు చేస్తున్న రిజిస్ట్రేషన్ ఆఫీసును వనపర్తి పట్టణంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదా అఖిల పక్ష ఐక్య వేదిక పోరాడుతుందని

లేకుంటే లోకాయుక్త, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, హైకోర్టును ఆశ్రయిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక తరపున సతీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు జానంపేట రాములు, నందిమల్ల చంద్రమౌళి, పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు, దళిత సంఘం నాయకుడు నాగరాజు  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్  

Related posts

ఎకరాకు రూ. లక్ష చెల్లించాలి

Bhavani

కొణిజర్ల లో గోద్రెజ్ కంపెనీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

Satyam NEWS

కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment