37.2 C
Hyderabad
May 2, 2024 14: 54 PM
Slider సంపాదకీయం

పనికి మాలిన పబ్లిసిటీ: వీళ్లా మన ఎంపిలు?

telugu MPs

పాకిస్థాన్‌ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదలకు పాక్‌ ప్రభుత్వం అంగీకారం. ఓకే. సంతోషమేగా. ఈ మేరకు విదేశాంగ శాఖకు సమాచారం అందించింది. ఇంకా సంతోషం. అంతకన్నా కావాల్సింది ఏముంది? మొత్తం 20 మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లారు. అక్కడ  చేపల వేటకు వెళ్లి తెలియక పాకిస్తాన్ సరిహద్దు క్రాస్ చేశారు.

దాంతో పాకిస్తాన్ వాళ్లు అరెస్టు చేశారు. ఈ సంఘటన జరిగింది 2018 డిసెంబర్ లో. అప్పటి నుంచి వారంతా పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. భారత ప్రభుత్వానికి పార్లమెంటు సభ్యులు ఈ సమాచారం అందించారు. భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. ఆ మత్స్యకారులను విడుదల చేసేందుకు అంగీకరించింది. జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద భారత్‌ అధికారులకు వారిని పాకిస్తాన్ అప్పగించనున్నది. ఇదీ వార్త.

ఈ వార్త చదివితే ఎంత సంతోషంగా ఉంది? మన ఎంపిలు, మన కేంద్ర ప్రభుత్వంపై మనకు గర్వం కలగదూ? కచ్చితంగా ఇది మనకు గర్వకారణం. అయితే ఇప్పుడు అతి నీచమైన రాజకీయ క్రీడ గురించి తెలుసుకుందాం. ఇది చదివితే మన ఎంపిలు ఎంత చీప్ పబ్లిసిటీగాళ్లో అర్ధం అవుతుంది. వీరంటే ప్రేమ కాదు కదా అసహ్యం పుడుతుంది.

భారత విదేశాంగ శాఖ నుంచి ఈ సమాచారం అందగానే మన ఎంపిలు ఎగబడ్డారు.

ఈ ఘనకార్యం చేసింది మేమంటే మేమని సోషల్ మీడియాలో తన్నుకుంటున్నారు. ఒకే సమాచారాన్ని షేర్ చేసి ఇది తమ వల్లే సాధ్యమైందని చెప్పుకున్నారు. తామే వారిని విడుదల చేయించామని బీరాలు పలుకుతున్నారు. ఫలించిన వైయస్సార్‌సీపీ ఎంపీ విజయిసాయిరెడ్డి ప్రయత్నాలు ఇది ఒక సోషల్ మీడియా మెసేజి.

శ్రీకాకుళం ఎంపీ, కింజరాపు రామ్మోహన్ నాయుడు మరో విజయం ఇది మరో మెసేజి. ఈ ఇద్దరూ వాళ్లు చెబితేనే పాకిస్తాన్ ప్రభుత్వం జాలర్లను విడుదల చేసినట్లు చెప్పుకుంటున్నారు. హతవిధీ. ఏమిటీ దౌర్భాగ్యం. ఈ చీప్ పబ్లిసిటీ కోసం ఎందుకు తన్నుకుంటున్నారు? ప్రతి విషయంలోనూ రాజకీయమేనా ఛీ ఛీ

Related posts

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Satyam NEWS

సెల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి టాప్: జిల్లా ఎస్పీ సిందూశర్మ

Satyam NEWS

శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

Satyam NEWS

Leave a Comment