31.7 C
Hyderabad
May 2, 2024 07: 53 AM
Slider తెలంగాణ

సిరిసిల్లలో అప్పారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్

ktr mumbai

ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన షాపర్స్ స్టాప్ సిరిసిల్లలో తన యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సమక్షంలో ముంబైలో జరిగిన సమావేశంలో ఈ మేరకు షాపర్స్ స్టాప్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం( యంవోయూ) కుదుర్చుకున్నది.

 సిరిసిల్ల పట్టణంలో  ఉన్న వస్త్ర పరిశ్రమ అనుకూల అవకాశాలను పరిశీలించిన తర్వత అక్కడే తమ యూనిట్  ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు షాపర్స్ స్టాప్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం అక్కడ ఉన్న మానవ వనరులు, టెక్స్టైల్ పార్క్, అప్పారల్ పార్కు వంటి మౌలిక వసతులు, వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి పలు అంశాలను తమను పెట్టుబడి పెట్టేలా  ప్రభావితం చేశాయని షాపర్స్ స్టాప్ తెలిపింది.

ఈరోజు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సిరిసిల్లలోని అప్పారెల్ పార్కులో తమ యూనిట్ను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ తరఫున ప్రకటిస్తామని తెలిపింది.  తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి మరియు షాపర్స్ స్టాప్  సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజీవ్ సూరి, ఈరోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు పత్రాలను మార్చుకున్నారు.

దేశంలోనే ప్రముఖమైన లైఫ్ స్టైల్ బ్రాండ్ షాపర్స్ స్టాప్ సిరిసిల్లా పట్టణానికి రావడం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా సిరిసిల్లలో  వందల మందికి ఉపాధి అవకాశాలతో లభించడంతోపాటు, ముఖ్యంగా స్థానిక మహిళలకు మంచి అవకాశాలు దొరుకుతాయన్నారు. షాపర్స్ స్టాప్ రాక సిరిసిల్ల అప్పారెల్  పార్క్ కు అభివృద్ధికి  ఏంతో దోహదం చేస్తుందన్న ఆశాభావాన్ని అయన వ్యక్తం చేశారు.

ముంబైలో పలువురు  టెక్స్టైల్ రంగ పారిశ్రామికవేత్తలతోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ టెక్స్టైల్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపిన మంత్రి కేటీఆర్, ఈ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు.

Related posts

మంత్రి మల్లారెడ్డి పద్దతి మార్చుకో …లేకపోతే తగిన బుద్ది చెప్తాం

Satyam NEWS

సీఎం సెక్యూరిటీ వద్ద ఉన్న డాగ్ స్క్వాడ్ కన్నా అధ్వాన్నమా…!

Satyam NEWS

11 వేల మంది ఉద్యోగుల తొలగింపు

Murali Krishna

Leave a Comment