31.7 C
Hyderabad
May 2, 2024 09: 24 AM
Slider ముఖ్యంశాలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికారులు సిద్ధం కావాలి

somesh kumar

నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుకు సంబంధించి వివిధ శాఖలు తమ వివరాలను మార్చి 4 నాటికి GAD కి  సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వివిధ ప్రశ్నలు, జవాబులు, ఆడిట్ పేరాలు, (Out Come Budget) బడ్జెట్  సన్నద్ధతపై  సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ నూతన రాష్ట్రపతి చట్టం అమలుకు సంబంధించి వివిధ శాఖలు ఇప్పటికే సమర్పించిన  నివేదికలపై జిఏడి, ఆర్ధిక శాఖ ద్వారా  అబ్జర్వేషన్లను పంపామని, శాఖలు తమ పోస్టుల వివరాలను నిబంధనల కనుగుణంగా మార్చి 4 నాటికి సమర్పించాలన్నారు.

Business rule ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుత సమావేశాలకు సంబంధించి వచ్చిన ప్రశ్నలతో పాటు, గత సమావేశాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు పంపాలని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

వివిధ శాఖల అధికారులు అసెంబ్లీ అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. పెండింగ్ ఆడిట్ పేరాలకు సంబంధించి సమాధానాలను పిఏసికి సమర్పించటానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. Note on demand, out come budget తయారీలో సమగ్ర వివరాలు ఉండాలన్నారు.

వివిధ శాఖలు తమకు సంబంధించి వివరాల బ్రీప్ ప్రోఫైల్ ను వెంటనే సమర్పించాలని సి.యస్ అన్నారు. ఈ సమావేశంలో  స్పెషల్ సి.యస్ లు రాజేశ్వర్ తివారి, శాంతికుమారి  ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్ కుమార్, సునీల్ శర్మ, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్, రవిగుప్త, అడిషనల్ డిజి.జితేందర్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహ్మాచార్యులు, కార్యదర్శులు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

Related posts

మాజి నక్సలైట్ చర్యలను భగ్నం చేసిన ములుగు జిల్లా పోలీస్

Bhavani

అంటు వ్యాధులు నిర్మూలిస్తే అందరికి ఆరోగ్యం

Satyam NEWS

Breaking News: ఏపీ గవర్నర్ కు ఢిల్లీ పిలుపు

Satyam NEWS

Leave a Comment