23.2 C
Hyderabad
May 7, 2024 19: 22 PM
Slider గుంటూరు

చిలకలూరిపేట ఆటోనగర్ ప్లాట్లు ఇస్తామని మోసం చేసిన మంత్రి

#Chilakaluripet Autonagar

ఎన్నికల సమయంలో ఉచితంగా చిలకలూరిపేట ఆటోనగర్ ప్లాట్లు ఇస్తామని మంత్రి విడదల రజనీ ఇచ్చిన హామీ ఏమైందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఆటోనగర్ ప్లాట్లు ఇస్తారని 700 కుటుంబాల వారు ఎదురుచూస్తున్న సమయంలో వారికి మొండిచేయి చూపించారని అన్నారు. 42 ఎకరాలు పోతవరం గ్రామంలో సమీకరించి గత ప్రభుత్వం సిద్ధం చేస్తే వాటిని పంపిణీ చేసేందుకు సెంటుకు 60 వేల రూపాయలు డబ్బులు ప్రస్తుత ప్రభుత్వం డిమాండ్ చేయడం సిగ్గుచేటని రావుసుబ్రహ్మణ్యం అన్నారు.

చిలకలూరిపేటలో కళామందిర్ సెంటర్ నుండి పురుషోత్తమపట్నం వరకు రోడ్డు పక్కన ఆటోమొబైల్ షాపులు,మెకానిక్ షాపులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుంటే మంత్రి రజనీ చూస్తూ కూర్చోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని రావుసుబ్రహ్మణ్యం ఆరోపించారు. విశ్వనాధ్ సెంటర్ లోని జీపులు తయారీ దారులు రావుసుబ్రహ్మణ్యం దృష్టికి సమస్యలు తీసుకురాగా ఆయా షాపుల వారి నుండి రావుసుబ్రహ్మణ్యం వివరాలు సేకరించారు.

మంత్రి విడదల రజనీ ఉచితంగా ప్లాట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు రెండు సెంట్ల ప్లాటుకి 1 లక్షా 20 వేల రూపాయలు డబ్బులు చెల్లించాలని చెప్పారని చెప్పడం సబబేనా అని జీపులు తయారీ దారులు ఆవేదనను వ్యక్తం చేశారని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను పరిష్కరించాలని కోరుతూ లేఖను రాస్తానని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. అవసరమైతే ఆటోమొబైల్ రంగంలో వారిని సమీకరించి ఉద్యమం చేస్తామని, నవతరంపార్టీ నుండి వారికి అండగా ఉంటామని తెలిపారు.

Related posts

ప్రజావ్యతిరేకత చూసి మతి చలించిన వైసీపీ నాయకులు

Satyam NEWS

ఆలె భాస్కర్ కు గణేష్ ఉత్సవ కమిటీ సన్మానం

Satyam NEWS

కేసీకెనాల్ భూమి ఆక్రమిస్తున్న అధికార పార్టీ నేతలు

Bhavani

Leave a Comment