Slider నల్గొండ

నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

#HujurnagarMedical

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మండల పరిధిలో ఈనెల 12వ, తేదీ వరకు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆషాడే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 1నుండి 19 సంవత్సరాల వయసు వారికి నులి  పురుగుల నివారణకు గాను ఆల్బెండజోల్ 400 మాత్రలను ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు  ఇంటింటికి వచ్చి అందించనున్నట్లు తెలిపారు.

మాత్రల పంపిణీకి వచ్చేటువంటి వైద్య సిబ్బందికి కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ప్రతి  ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటిలోని కుటుంబ సభ్యులు మాస్కు ధరించాలని, మాత్రలు  పంపిణీ చేసేటువంటి సిబ్బంది  కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

అత్యవసర సమయంలో 108 వాహనాన్ని సంప్రదించాలని కోరారు. అనంతరం ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి అందించబడిన ఆశ  యూనిఫామ్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు ప్రమీల, పుల్లమ్మ, ఇందిరాల రామకృష్ణ, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎనాలసిస్: మళ్లీ లాక్ డౌన్ వైపు చూస్తున్న పలుదేశాలు

Satyam NEWS

అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Satyam NEWS

ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత!!

Sub Editor

Leave a Comment