30.2 C
Hyderabad
May 13, 2024 12: 16 PM
Slider ప్రపంచం

ఢమాల్ అంటున్న చైనా రియల్ ఎస్టేట్ రంగం

#chinarealestate

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం మళ్లీ తలెత్తబోతున్నదా?

చైనా ఆర్ధిక పటిష్టతకు మూలస్తంభం అయిన రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఇదే అత్యుత్తమ పెట్టుబడి అని నమ్మి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన వారంతా చైనా నుంచి వస్తున్న వార్తలు చూసి ఆందోళనకు గురవుతున్నారు. చైనా జీడీపీలో రియల్ ఎస్టేట్ వాటా దాదాపు 30 శాతం ఉంటుంది.

చైనా ఆర్థిక వ్యవస్థకు ఇదే ఊపిరి. అలాంటి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు సంక్షోభంలోకి చేరుకున్నది. అపార్ట్ మెంట్లు బుక్ చేసుకున్న వారు వాయిదాలు చెల్లించడం లేదు. పెట్టుబడులు పెట్టే వారు రియల్ ఎస్టేట్ రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు.

వెరసి చైనా రియల్ ఎస్టేట్ రంగం పతనావస్థకు చేరుకుంటున్నది. కరోనా తొలి లాక్ డౌన్ కాలం నుంచి ఈ పరిస్థితి నెలకొని ఉన్నది. చైనాలో దాదాపు 85 శాతం ఇళ్లు నిర్మాణం పూర్తికాకముందే అమ్ముడయ్యాయి. అంటే భవనాలు పూర్తి కావడానికి సంవత్సరాల ముందే రుణాలకు సంబంధించిన వాయిదాలు ప్రారంభమవుతాయి.

2020 నుండి రియల్ ఎస్టేట్ రంగంలో నిర్మాణ కార్యకలాపాలు మందగించాయి. దీని వలన వినియోగదారులకు సమయానికి ఇళ్లను డెలివరీ చేయడం కష్టం అయింది. మొదట్లో 30 ప్రాజెక్టులు సమస్యలు ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత ఆ సంఖ్య 300కు చేరుకోగా ఇప్పుడు మరింత పెద్ద సంఖ్యలో నిర్మాణాలు ఆగిపోయాయి. డెవలపర్ల వద్ద డబ్బులు లేకపోవడంతో ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు సాగలేదు.

నెలలు గడుస్తున్నా సకాలంలో ఇళ్ల పూర్తికాకపోవడంతో వినియోగదారులు రుణం చెల్లించడంలో విఫలమయ్యారు. ఇది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. 2021 లో, ప్రభుత్వమే చాలా భవనాలను కూల్చివేసింది. ప్రభుత్వ ఈ చర్య వల్ల చాలా మంది డెవలపర్లు దివాలా తీశారు. చైనాలో నిర్మాణ అనుమతులు లేకుండా నిర్మించిన అనేక ఆకాశహర్మ్యాలను కూల్చివేయడం వల్ల ఎవర్‌గ్రాండేతో సహా కంపెనీలకు భారీ ఆర్థిక భారం ఏర్పడింది.

ఎవర్‌గ్రాండే వంటి దిగ్గజ కంపెనీలకు, సకాలంలో రుణ వడ్డీని చెల్లించలేకపోవడం, అంతర్జాతీయ బాండ్ చెల్లింపులు వైఫల్యం సమస్యల ఊపందుకున్నాయి. చాలా మంది ఫ్లాట్ యజమానులు కస్టమర్ల నుండి ముందస్తు చెల్లింపు పొందిన తర్వాత వారి ఫ్లాట్‌లను సంవత్సరాలుగా అప్పగించలేదు. హోమ్ లోన్ కస్టమర్లు ప్రస్తుతం ఉంటున్న ఇంటి అద్దెతో పాటు భారీగా ఈఎంఐ చెల్లించాల్సి వస్తోంది.

దాంతో వారు ఈఎంఐలు చెల్లించడం లేదు. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం యునైటెడ్ స్టేట్స్ లోని రియల్ ఎస్టేట్ సంక్షోభంతో ప్రారంభమైంది. అదేవిధంగా, చైనీస్ రియల్ ఎస్టేట్ సంక్షోభం ఈ సంవత్సరం ప్రపంచ ఆర్ధిక మాంద్యం ఆజ్యం పోస్తుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Related posts

బీసీలపై జగన్ సర్కార్ దాడి

Bhavani

తెలంగాణ నుండి యూరప్ కు వేరుశనగ ఎగుమతులు

Satyam NEWS

సిఏఏ నిబంధనల రూపకల్పనలో మరింత జాప్యం

Satyam NEWS

Leave a Comment