23.7 C
Hyderabad
May 8, 2024 06: 11 AM
Slider ప్రత్యేకం

సీఎం జగన్ వెకిలినవ్వు.. నిరుద్యోగుల చెవిలో పువ్వు !

#tdp

విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద తెలుగు యువ‌త నిర‌స‌న‌….!!

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద టీడీపీ ఆధ్వ‌ర్యంలో  తెలుగు యువ‌త  జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల  చేయ‌నందుకు నిర‌స‌న‌గా ఆందోళ‌న నిర్వ‌హించింది. ఈ సందర్భంగా  తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షులు వేమలి చైతన్య బాబు, ప్రధాన కార్యదర్శి గొలగాన సురేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి సాయికృష్ణ మాట్లాడుతూ నిరుద్యోగులను జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మోసం చేసి రోడ్డున పడేసారని అన్నారు.

గత ప్రభుత్వంలో అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఆనాడు పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ చంద్రబాబు గారు యువత కి ఏమీ చేయలేదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వంచించారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.81 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో కూడిన నూతన జాబ్ కేలండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా మంత్రి పదవులు, వైసీపీ నేతలకు లక్షలాది వేతనాలతో కూడిన కార్పొరేషన్ చైర్మన్ లు, వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలు తప్ప నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని,  నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుల పేరుతో, కార్పొరేషన్, ఇతర నామినేటెడ్ పదవుల పేరుతో లక్షలాది రూపాయల వేతనాలను తమ అనుచరులకు కట్ట బెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగాలు లేక, ఉపాధి లభించక నిరుద్యోగుల ముఖాలు వెల వెల బోతుంటే మంత్రుల, నూతన మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులతో వైసీపీ నేతల ముఖాలు కళ కళ లాడిపోతున్నాయని అన్నారు.వెంటనే 2.81 లక్షల ఉద్యోగాలతో కూడిన నూతన జాబ్ కేలండర్ ను విడుదల చేయాలని, లేని పక్షంలో తెలుగుయువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ప్రతీ మండలం లోనూ నిర్వహిస్తామని అన్నారు

ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల తెలుగుయువత అధ్యక్షులు గంటా రవి, పిన్నింటి కిషోర్, పెడిరెడ్ల సత్యన్నారాయణ, సేశపు రాజేశ్, మంత్రి గోవింద, పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షులు గేదెల రవీంద్ర కుమార్, పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శులు పాలూరి రాజు నాయుడు, కర్రోతు పైడి రాజు, అధికార ప్రతినిధులు వినోద్ కుమార్, రామ్ ప్రసాద్, ఆనంద్ , నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు మహంతి కిషోర్, సంతోష్, చైతన్య, పట్టణ అధ్యక్షులు మాతా బుజ్జి, మండలాల అధ్యక్షులు కుబిరెడ్డి వెంకటేష్ , అకిరి జగదీష్, బయిరెడ్డి కళ్యాణ్, తోగులు రెడ్డి, శ్రీరామ్, పైడి నాయుడు, రమణ, శ్రీను, పార్టీ నాయకులు కుటుంబరావు,  కోదండరాం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: నెలలో పెళ్లి చైనాలో కర్నూల్ యువతి

Satyam NEWS

ఉద్యమంలాగా కొనసాగుతున్న సుందర అనంతపురం

Satyam NEWS

Free|Trial Cbd Hemp Harvest Process 9 Percent Cbd Hemp Flower

Bhavani

Leave a Comment