38.2 C
Hyderabad
April 28, 2024 22: 25 PM
Slider రంగారెడ్డి

వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన సైబరాబాద్ పోలీసులు

#musiriver

భారీ వర్షాల వల్ల, హిమాయత్ సాగర్ జలాశయం 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. తద్వారా నీటి ఉధృతి అధికంగా ఉండటంతో టీఎస్‌పీఏ నుంచి రాజేంద్ర నగర్‌కు వెళ్లే సర్వీస్‌ రోడ్డుకు  రాకపోకలు  అంతరాయం ఏర్పడింది. అయితే సుమారు 4:45 గంటల సమయంలో  బైక్‌పై ఒక వ్యక్తి కలీజ్ ఖాన్ దర్గా నుండి శంషాబాద్ వైపు వెళ్లేందుకు హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ వంతెనను బారికేడ్లు ఉన్నప్పటికీ వరద నీరు ప్రవహించే  రోడ్డుపైకి ప్రవేశించి దాటడానికి ప్రయత్నించాడు.

దాంతో అతను వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. అతను వరద ఉధృతికి కొట్టుకుపోతున్న సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం వారు నీటిలో కొట్టుకుపోతున్న బాధితుడిని తాడు సహాయంతో రక్షించారు. తమకు అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో మరియు శ్రద్ధతో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం  కృషిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అభినందిచారు.

Related posts

ఏజిటేషన్:మంగుళూరు లో తిరుపతి బస్సు ఫై రాళ్లు

Satyam NEWS

యంగ్ హీరో లకు సీపీ సవాల్

Bhavani

శ్రీజోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయం ఈవోగా పురందర్ కుమార్

Satyam NEWS

Leave a Comment