29.7 C
Hyderabad
May 3, 2024 05: 42 AM
Slider నల్గొండ

పొరుగు రాష్ట్రాల కార్మికులను ఆదుకోవాలి: సి ఐ టి యు

#citu

సిమెంట్ పరిశ్రమ ప్రాంతాలలో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాలైన బీహార్, ఒరిస్సా,ఉత్తరాఖండ్,చత్తీస్గడ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు చాలీచాలని కూలితో చాలా దుర్భర జీవితం గడుపుతున్నారని తక్షణమే యాజమాన్యం లేబర్ అధికారులు స్పందించాలని కాంట్రాక్ట్ కార్మికుల్ని ఆదుకోవాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి డిమాండ్ చేసినారు.

ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల పరిధిలోని మై హోమ్ సిమెంట్ నూతన ప్లాంట్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు నివాస ప్రాంతాలలో కృష్ణపట్టే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ సి ఐ టి యు అనుబంధం ఆధ్వర్యంలో సర్వే చేస్తున్న సందర్భంగా అనేక విషయాలు తెరపైకి వచ్చాయని,పరిశ్రమ ఏర్పాటు చేసిన నివాస కాలనీలలో కనీస వసతులైన మంచినీరు,మరుగుదొడ్లు కల్పించకపోవడంతో చిన్న చిన్న గదులలో పదుల సంఖ్యలో కార్మికులు జీవిస్తున్నారని,ఈ మధ్యకాలంలో ఒక కార్మికుడు సర్పకాటుకి గురైన కోదాడ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిపారని, వీటితో పాటు కొత్త ప్లాంట్ కోసం సంవత్సరన్నర నుండి రెండు సంవత్సరాల వరకు పనిచేస్తున్న వారు,ప్రస్తుత పరిశ్రమలో పని చేస్తున్న వారిని కలిపి సుమారు ఒక 600 మంది కార్మికులకు కనీసం వేతనం, పిఎఫ్,బోనస్,గ్రాడ్యుటీ,ఓటి ఏమీ లేదని, కాంట్రాక్టర్ల కనుసైగల్లో ఉన్నారని శీతల రోషపతి ఆరోపించారు.కార్మికులు తమతో మాట్లాడటానికి భయపడుతున్నారని, ఇప్పటికైనా కార్మికులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని,కనీస వేతనాలు అలవెన్స్ లు, కార్మికులకు స్వేచ్ఛని ఇవ్వాలని యాజమాన్యాన్ని రోషపతి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు యలక సోమయ్య గౌడ్,ఆదినారాయణ,శ్రీనివాస్,సౌదీ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

వనపర్తిలో డ్రా పద్దతిలో బార్ లు కేటాయించిన కలెక్టర్

Satyam NEWS

శిలాఫలకాల‌ ఆవిష్కర‌ణ‌లా? శ‌ంకుస్థాప‌న‌లా?

Sub Editor

పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వైపు ప్రజలు వెళ్లేలా చేయాలి

Satyam NEWS

Leave a Comment