39.2 C
Hyderabad
May 4, 2024 22: 52 PM
Slider నల్గొండ

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి: సిఐటియు

#citu

సంఘటిత రంగం లోని కార్మికులకి సమగ్ర వేతన చట్టం తెచ్చి కార్మికులను ఆదుకోవాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం బూరుగడ్డ గ్రామంలో పరపతి సంఘం హమాలీల సమావేశంలో పాల్గొన్న శీతల రోషపతి మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దొడ్డి దారిన మార్చి 4 కార్మిక కోడులు చేయడం అన్యాయమని అన్నారు.

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని తదితర డిమాండ్లతో మార్చి 28,29వ,తేదీలలో రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని,అర్హులైన కార్మికులకు గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, తెల్లరేషన్ కార్డు మీద నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్  అధ్యక్షుడు నందిపాటి చిన్న రాములు, కందుకూరు రవి,తిరుపతి,గోపి, ఈదయ్య,కస్తాల వేణు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

విజయ డైరీ పాల సేకరణలో సిబ్బంది చేతివాటం

Satyam NEWS

ఓ గాడ్: పొలాల్లో దిగిన జిందాల్ జెట్ విమానం

Satyam NEWS

కేదార్ నాధ్ స్పటిక లింగం.. అక్కడ….ప్రత్యక్షం….!

Satyam NEWS

Leave a Comment