Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేయాలి

#roshapati

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట సాక్షిగా మోడీ అబద్ధాలు ఆడరని,చిన్న రాష్ట్ర మైన కేరళ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో మిగిలిందని సూర్యాపేట జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కొనియాడారు.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 9 నెలలకు పైగా రైతులు ఆందోళన చేస్తుంటే సుమారు 600 మంది రైతులు ప్రాణాలు ఉద్యమంలో వీరమరణం పొందితే బిజెపి ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ నడిబొడ్డులో ర్యాలీ తీసి,నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఢిల్లీ వదిలి తమ సొంత గూటికి వెళ్ళమని దీక్ష పూనారని,ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కేరళ రాష్ట్ర పర్యటనలో భాగంగా రోషపతి వివిధ రంగాల కార్మికులను కలిసి  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కార్మికులకు ఒకరోజు వేతనం 600 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేరళ సిఐటియు నాయకులు జాకోబ్ కర్నూల్,సూర్యాపేట జిల్లా సిఐటియు కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్,రాజు,మధువరి, నాగయ్య,సీతారాం తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రిక్వెస్టు: ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలి

Satyam NEWS

ఐక్యతను చాటానున్న క్రీడలు

Bhavani

సీఎం కేసీఆర్ కు విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ

Satyam NEWS

Leave a Comment