23.2 C
Hyderabad
May 8, 2024 00: 25 AM
Slider హైదరాబాద్

రిక్వెస్టు: ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలి

Talasani 171

కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాంగోపాల్ పేట లోని నల్లగుట్ట కంటై న్మెంట్ ప్రాంతంలో సోడియం హై పో క్లోరైడ్ స్ప్రే పనులను పరిశీలించారు.

ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్ లేదా, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆ ప్రాంత ప్రజలకు మంత్రి సూచించారు. ఈ సందర్బంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నిత్యావసర వస్తువులు, మందులు, కూరగాయలు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని అవసరమైన మందులు అందజేయాలని వైద్య శాఖా అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, acp వేణు గోపాల్ రెడ్డి, ci గిరిబాబు తదితరులు ఉన్నారు.

Related posts

తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలు సహించేది లేదు

Satyam NEWS

తెలంగాణలో రైతులకు న్యాయం చేయాలని తెలుగుదేశం ఆధ్వర్యంలో ర్యాలీ

Satyam NEWS

ఈ రెడ్డి బాబులు..ఉద్యోగ సంఘనేతలా ! అధికార పార్టీ సేవకులా ?

Satyam NEWS

Leave a Comment