37.2 C
Hyderabad
May 6, 2024 12: 25 PM
Slider నల్గొండ

దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్న మోడీ

#CITUHujurnagar

కార్మికుల, రైతుల రెక్కల కష్టంతో నిర్మితమైన దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్లకు దోచి పెట్టడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక  చట్టాలను తెచ్చిందని CITU రాష్ట్ర కార్యదర్శి భూపాల్ విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోశపతి అధ్యక్షతన జరిగిన కార్మిక, కర్షక పోరు యాత్ర సభలో భూపాల్ మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, 4 లేబర్ కోడ్ లను, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేసే వరకు రైతులు, కార్మికులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

BJP ప్రభుత్వం కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తున్నాయని 4 కార్మిక వ్యతిరేక లేబర్  కోడ్ లను అప్రజాస్వామికంగా ఆమోదించుకున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎముకలు కొరికే చలిలో గత 60 రోజులుగా ఢిల్లీ నగరంలో రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.

ఇప్పటికే 135 మంది రైతులు ఈ పోరాటంలో అమరులయ్యారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు.

కార్మిక కర్షక పోరుయాత్ర హుజూర్ నగర్ కు వచ్చిన సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్మికులు, కర్షకులు, అభిమానులు ఘన స్వాగతం పలికి, ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, సూర్యాపేట సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, సిఐటియు నల్గొండ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్,

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లక్కవరం బాలాజీ నాయక్, మండల అధ్యక్షుడు గోవిందు, ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తాఫా, పట్టణ అధ్యక్షుడు ఉప్పుతల వెంకన్న, పల్లపు వెంకన్న, నరేష్, శివ, లక్ష్మి, శ్రీను, కోటమ్మ, వేణు, నాగరాజు, నాగేశ్వరరావు,సురేష్, తదితర కార్మిక నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్య

Satyam NEWS

గ్రామ స‌చివాల‌య కార్య‌ద‌ర్శిల‌కు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే వార్నింగ్….!

Satyam NEWS

Leave a Comment