39.2 C
Hyderabad
May 3, 2024 11: 39 AM
Slider సంపాదకీయం

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గోడదెబ్బ- చెంపదెబ్బ

#Y S Jaganmohan Reddy

న్యాయమూర్తులు మారడంతో ఇక నుంచి తీర్పులు తమకు అనుకూలంగా వస్తాయని భావించి బాహాటంగా సంతోషం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సుప్రీంకోర్టు తీర్పు మింగుడు పడటం లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరి ఉన్న కాలంలో దాదాపుగా 150 కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వెలువడ్డాయి. దాంతో భారత దేశంలో న్యాయ వ్యవస్థ పై పలు ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ద్వారా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో చర్చనీయాంశమయ్యారు.

న్యాయమూర్తులు తనపై కక్షగట్టి తీర్పులు చెబుతున్నారనే వాదనను ఆయన, ఆయనతో బాటు ఆయన మంత్రి వర్గ సహచరులు, సలహాదారులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. చాలా మంది ప్రజలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వాదనతో ఏకీభవించారు.

న్యాయమూర్తులు ఏదో ప్రలోభాలకు లోబడి తీర్పులు చెబుతున్నారని అనుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి బదిలీ జరిగింది. ఈ బదిలీ జరగడానికి కారణం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆ పార్టీ నేతలు సామాజిక మాధ్యమాలో బాహాటంగానే ప్రచారం చేశారు.

దీన్ని కూడా వైసీపీ అనుకూల వర్గాలు పూర్తిగా నమ్మాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ రాకేష్ కుమార్ పై అధికార పార్టీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అమరావతి రైతుల కేసు నుంచి తప్పుకోవాలని ఆయనకు నేరుగా చెప్పేంత సాహసం కూడా చేసింది.

జస్టిస్ రాకేష్ కుమార్ ఆ తర్వాత పదవి విరమణ చేశారు. కొత్త న్యాయమూర్తులు వచ్చారు. ఈ అన్ని కారణాలతో ఇక తీర్పులు తమకు అనుకూలంగా వస్తాయని వైసీపీ నాయకులు భావించారు. పంచాయితీ ఎన్నికలపై సింగిల్ జడ్జి తీర్పు తమకు అనుకూలంగా వెలువరించడంతో ఇక రాష్ట్ర హైకోర్టులో తమకు ఎదురేలేదని వారు భావించారు.

ఇక నుంచి కోర్టు తీర్పులన్నీ తమకు అనుకూలంగానే వస్తాయని వారు బాహాటంగానే చెప్పారు. అయితే వారు ఊహించని విధంగా హైకోర్టు ధర్మాసనం స్థానిక ఎన్నికలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అప్పుడే సైలెంట్ అయిపోయిన వైసీపీ నాయకులు తదుపరి చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది కానీ వారు అలా చేయలేదు.

రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి, అధికారులతో బలవంతంగా సహాయ నిరాకరణ చేయించారు. ఇదంతా చేస్తూ సుప్రీంకోర్టు లో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని వారు ఎలా భావించారో అర్ధం కావడం లేదు.

గతంలో చాలా సందర్భాలలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అయినా ఉద్యోగ సంఘాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లడం అక్కడ తీర్పు వ్యతిరేకంగా రావడం జరిగిపోయింది. ఇది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నైతిక పరాజయం

Related posts

కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతించిన 90 ఏళ్ల వృద్ధురాలు

Satyam NEWS

ఎంఎల్ఆర్ఐటీలో ఐషాకు ఘ‌న స‌త్కారం

Satyam NEWS

జగన్ పార్టీ నుండి లీడర్లు పారిపోవడం షురూ!

Satyam NEWS

Leave a Comment