38.2 C
Hyderabad
May 3, 2024 20: 06 PM
Slider హైదరాబాద్

రేషన్ దుకాణం ప్రాంతాలను పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్

CP Anjaneekumar

కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న లాక్ డౌన్ లో ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం విడుదల చేసిన రేషన్ ఏ విధంగా అందచేస్తున్నారనే అంశంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నేడు పర్యవేక్షించారు. రేషన్ దుకాణాల వద్ద నిత్యవసరాలు తీసుకునే సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

నేటి ఉదయం నుంచి ఆయన హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. హుమయూన్ నగర్, ఆసిఫ్ నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాలలో రేషన్ దుకాణాలు ఉన్న ప్రాంతాలలో ఆయన నిశిత పరిశీలన చేశారు. ఒక్కొక్కరికి మధ్య ఎంత దూరం ఉండాలి? మార్కింగ్ ఏ విధంగా చేయాలనే అనే అంశాలపై ఆయన వారికి పలు సూచనలు చేశారు. ఎటువంటి సమస్య లేకుండా నిత్యావసర వస్తువులు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

Related posts

ఆశావర్కర్ కుటుంబానికి తెలంగాణ జాగృతి అండ

Satyam NEWS

సత్తెమ్మ గుడి వద్ద పోటెత్తిన జనం

Satyam NEWS

IIFL ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన ములుగు సి ఐ

Satyam NEWS

Leave a Comment