29.7 C
Hyderabad
April 29, 2024 10: 09 AM
Slider నిజామాబాద్

కరోనా ఎలర్ట్: మరి కొన్ని రోజులు లాక్ డౌన్ పాటించండి

minister Vemula

మరికొన్ని రోజులు లాక్ డౌన్ పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 20 రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్ లో ఉన్న 1272 మందిలో 1267 మంది 14 రోజులు పూర్తి చేసుకున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1007 మందిలో 628 మంది 14 రోజులు పూర్తి చేసుకున్నారు.. ఇంకా 379 మంది క్వారంటైన్ పూర్తి కావాల్సి ఉందన్నారు. వీరిలో ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని చెప్పారు.

బాన్సువాడలో 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరితో 90 మంది కనెక్ట్ అయినట్టు గుర్తించామన్నారు. 57 మందికి టెస్టులు చేయగా 27 మంది రిపోర్ట్ వచ్చింది, 24 మందికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని, నేడు మరొక 33 మంది శాంపిల్స్ ఈ రోజు టెస్ట్ కోసం పంపించారని తెలిపారు.

పాజిటివ్ వచ్చిన వారి ప్రాంతాలను కంటోన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 10,473 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా 9 వేల మెట్రిక్ టన్నులు పంపిని పూర్తయిందని తెలిపారు. జిల్లాలో 320 వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయగా 20 కేంద్రాలు ప్రారంభించామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు.

 రేషన్ కార్డులు లేనివారు తమకు కూడా బియ్యం ఇవ్వాలని కోరుతున్నారని, కార్డు ఉండి బియ్యం అవసరం లేనివారు కార్డు లేని వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. కామారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్వంతంగా 5 లక్షల రూపాయలు విరాళాలు సేకరించారు.

ఈ విరాళాలు విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల కోసం ఉపయోగించాల్సిందిగా కలెక్టర్ కు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్ కుమార్, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే అసిస్టెంట్ కలెక్టర్ నందన్ లాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజకీయ నాయకుల్లా కొట్లాడుకుంటున్న పోలీసులు

Satyam NEWS

అయోధ్య రామ్ లాలాకు 155 దేశాల నీటితో అభిషేకం

Satyam NEWS

ఏపీలో స్థానిక ఎన్నికల్లో ఎక్కడా గొడవలు జరగలేదు

Satyam NEWS

Leave a Comment