31.2 C
Hyderabad
May 3, 2024 00: 29 AM
Slider కడప

విద్యుత్  అధికారులు, కాంట్రాక్టర్లతో మహిళా రైతులు వాగ్వాదం…

#rajampet

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చెయ్యేరు రాచపల్లె వరద బాధిత మహిళా రైతులు బుధవారం విద్యుత్ కార్యాలయం వద్ద అధికారులు, కాంట్రాక్టర్లతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్థానిక ఏ.యి బాల సుబ్రహ్మణ్యంని వారు నిలదీసారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్ రమణను పిలిపించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు  ఏడు నెలల గడిచినా చెయ్యేరు లో తమ పొలాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్, స్తంభాలు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

వారితో కాంట్రాక్టర్ రమణ దురుసుగా ప్రవర్తించారు. తనకు ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తానని,తాను స్థానిక  లేబాకు గ్రామ వాసినని తనను మీడియా యెదుట బెదిరిస్తే బెదరిని మహిళా రైతులతో వాగ్వాదానికి దిగారు.ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరిలో కాంట్రాక్టర్ రమణ తనకు సంబంధం లేదని తనను ఎవరూ ప్రశ్నించవద్దని మాట మార్చిగా,అప్పటి వరకు ప్రేక్షక పాత్ర పోషించిన ఏ.యి.సురేంద్ర నాలుగు రోజుల్లో పని ప్రారంభిస్తామని బాధిత రైతులకు హామీ ఇచ్చారు. ఇలా రేపు మాపు అని 11 నెలలు పైగా కాలం వెళ్ల బుచ్చారని ఇప్పటికే హామీ నెరవేర్చాలని, లేని పక్షంలో చేయలేమని రాత పూర్వక హామీ ఇవ్వాలని మహిళా రైతులు విన్నవించారు.

Related posts

15 మంది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల డిస్మిస్

Satyam NEWS

బాక్సింగ్ లో లోవ్లినాకు స్వర్ణ పతకం

Satyam NEWS

డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ కోసం గంట‌న్న‌ర సేపు మీడియా ప‌డిగాపులు…!

Satyam NEWS

Leave a Comment