29.7 C
Hyderabad
May 2, 2024 04: 16 AM
Slider మహబూబ్ నగర్

నిర్లక్ష్యంగా తూనికలు కొలతల అధికారుల పనితీరు

#kalwakurthy

తూనికలు కొలతల అధికారులు వారి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి వాహన డ్రైవర్ తో తనిఖీలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బుధవారం జిల్లా అధికారులు తనిఖీల్లో భాగంగా హార్డ్వేర్, కిరాణం దుకాణాలను, పెట్రోల్ బంక్ లోను తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా  పట్టణ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న హైమాతాజీ  హార్డ్వేర్ దుకాణంలో తూనికలు కొలతల అధికారుల వాహన డ్రైవర్ తనిఖీలు నిర్వహించారు.

తనిఖీలు నిర్వహించే క్రమంలో ఫోటో తీసుకుంటున్న ఓ విలేకరిపై దురుసుగా ప్రవర్తించాడు. అధికారులు నామమాతృపు తనిఖీలు చేస్తూ తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న దుకాణాలను ఎంచుకొని మరి వారిపై కేసులు పెడుతున్నారు. కాగా బడా వ్యాపారులు ఎలాంటి అవినీతికి పాల్పడ్డా చర్యలు లేవు కేసులు లేవు. ఎమ్మార్పీ మించి విక్రయిస్తున్న, కల్తీ, తక్కువ బరువుతో ఉన్న వస్తువులను గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా వారిపై కేసు నమోదు చేయకుండా వారికి వత్తాసు పలుకుతూ వారి వ్యాపారాలకు అండదండగా నిలుస్తున్నట్లు చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

త్రాసుల ముద్రణా విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే పదిరెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ముద్ర వేసే కాంట్రాక్టర్లు ముందుగా రసీదు ఇవ్వకుండా డబ్బులు తీసుకెళ్లి కొద్ది రోజులకు రసీదు తెచ్చిస్తున్నారని, అది కూడా వారి రసీదులో త్రాసుకు మరమ్మతు చేసినట్లు ఉంటుందని ప్రశ్నించే వారిపై తూనికల అధికారులకు ఫిర్యాదు చేసి ఏదో ఒక కేసును నమోదు చేయిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఇలాంటి అధికారులపై శాఖపరమైన తీసుకోవాలని వ్యాపారస్తుల కోరుతున్నారు.

పోలా శ్రీధర్, సత్యంన్యూస్.నెట్, కల్వకుర్తి

Related posts

“ఎన్ టి ఆర్ అవార్డ్స్”తో ఎఫ్ టి పి సి ఇండియా కు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్

Satyam NEWS

మైనాస్వామికి అరుదైన గుర్తింపు

Satyam NEWS

అంతర్వేది రథం దగ్దం ఘటనపై రాజంపేటలో నిరసన

Satyam NEWS

Leave a Comment