38.2 C
Hyderabad
April 29, 2024 11: 12 AM
Slider ప్రత్యేకం

డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ కోసం గంట‌న్న‌ర సేపు మీడియా ప‌డిగాపులు…!

“రాజ్యాంగ బ‌ద్దంగా..చ‌ట్టానికి లోబ‌డి. అనుశాసనంతో న‌డుచుకుంటాన‌ని దైవ సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాను”. ఇలా ప్ర‌తీ ఒక్క మంత్రితో బాద్య‌త‌లు చేప‌ట్టిన అనంతరం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణం చేయిస్తారు.

ఇక జిల్లాల‌కు వెళ్లిన స్థానిక మంత్రులు త‌ద‌నుగుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం జ‌రుగుతోంది.కాని ఏపీలోని విజ‌య‌గ‌రం జిల్లో అదీ కొత్త‌గా ఏర్ప‌డ్డ పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా సాలూరు కు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే పీడిక రాజ‌న్న దొర …తొలిసారిగా డిప్యూటీ సీఎంగానూ, గిరిజ‌న శాఖ మంత్రిగానూ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

అనంత‌రం ఈ నెల 13న విజ‌య‌న‌గ‌రం జెడ్పీ గె స్ట్ హౌస్ కు వ‌స్తార‌ని..అక్క‌డే అధికారులు,స్థానిక ప్ర‌జాప్ర‌తినిదుల‌ను క‌లుస్తార‌ని అక్క‌డ నుంచీ న‌గ‌రంలోని పైడితల్లి అమ్మ‌వారి ద‌ర్శ‌నానిక్ఇ వెళ‌తార‌ని స‌మాచార‌,పౌర‌సంబంధాల శాఖ ఏడీ ర‌మేష్ మీడియా కు స‌మాచారం ఇచ్చారు.దీంతో ఇచ్చిన స‌మ‌యం క‌న్నా ఓ అర‌గంట ముందుగానే విలేకరులంద‌రూ జేడ్పీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

జిల్లా అధికార యంత్రాంగం అందరూ రావ‌డం, డిప్యూటీ సీఎంకు పుష్ప గుచ్ఛాల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌డం ,అదే విదఃగా బందోబ‌స్తు ప‌రంగా ఎస్పీ వ‌చ్చి. ..డిప్యూటీ సీఎంకు క‌ల‌వ‌డం అన్నీ చ‌క‌చ‌క‌గా జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో మీడియా స‌మవేశ మంద‌రింలో కూర్చోవాల‌ని..మ‌రి కాసేప‌ట్లో డిప్యూటీ సీఎం వ‌చ్చి మాట్లాడ‌త‌రాని పౌర స‌మ‌చార,సంబంధాల శాఖ ఏడీ ర‌మేష్ ను చెప్ప‌డంతో మీడియా నిరీక్షించ‌డం ప్రారంభించింది.ప‌ద‌కొండున్న‌ర‌…. ప‌న్నెండు…..ప‌న్నెండున్న‌ర‌,ఒంటిగంట అయినా స‌మావేశ మందిరంలోకి డిప్యూటీ సీఎం రాక‌పోవ‌డంతో..ఒక్కొక్కొ మీడియా ప్ర‌తినినిది….త‌మ‌కు ఇచ్చిన స‌మ‌యం ప్ర‌కారం..వేరువేరుగా డిప్యూటీ సీఎం ను ఇంట‌ర్వ్యూ చేసేసారు.

తీరా…జేడ్పీ చైర్ ప‌ర్స‌న్ రాలేక‌పోవడంతో..మీడియాతో్ మాట్లాడాతాన్న అంశాన్ని ప‌క్క‌కు పెట్ట‌డం జరిగింది. స‌మ‌యం మించిపోడంతో నేరుఆ పైడిత‌ల్లి అమ్మ‌వారి ద‌ర్శ‌నం అక్క‌డ నుంచీ ఎమ్మెల్యే ఇంటికి భోజ‌నానికి డిప్యూటీ సీఎం బ‌య‌లు దేరి వెళ్లిపోయారు.

దీంతో దాదాపు గంట‌న‌ర్న‌కు పైగా ప్రెస్ మీట్ కొర‌కు నిరీక్షించిన మీడియాకు నిరాశే ఎదురైంది. అయితే డిప్యూటీ సీఎం హోదా పెద్ద‌దా..? జేడ్పీ చైర్ ప‌ర్స‌న్ హోదా పెద్ద‌దా అన్న ముచ్చ‌ట్లు చర్చించుకోవ‌డం ప్రారంభ‌మైందని అంటోంది..స‌త్యం న్యూస్.నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం

Related posts

మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు

Satyam NEWS

రిమంబరింగ్: నేనూ నా డ్రైవింగ్ లైసెన్సు

Satyam NEWS

Protest: పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయొద్దు

Satyam NEWS

Leave a Comment