37.2 C
Hyderabad
May 6, 2024 22: 14 PM
Slider ప్రత్యేకం

పేరు మార్పు: ఇప్పటి వరకూ నోరు మెదపని లక్ష్మీపార్వతి

#laxmiparvati

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్జెంట్ గా ఎన్ టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పై ఇప్పటి వరకూ ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి స్పందించలేదు. ఎన్టీఆర్ అంటే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతో అభిమానమని చెప్పే నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై స్పందించకపోవడం చర్చనీయాంశం అయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ యూనివర్సిటీల పరిధిలో ఉన్న వైద్య విద్యాలయాలను ఒకటిగా చేసి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు హెల్త్ యూనివర్సిటీని స్థాపించారు. ఆ హెల్త్ యూనివర్సిటీకి ఆయనే ఛాన్స్ లర్ గా ఉన్నారు. ఆయన మరణానంతరం ఆ యూనివర్సిటీకి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు. అంతటి చారిత్రాత్మక సంస్థ పేరును ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అకస్మాత్తుగా పేరు మార్చింది.

రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని సంస్థ పేరు మార్చినట్లుగా వార్తలు వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీ నాయకులతో బాటు పలువురు ప్రముఖులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే స్వయంగా ఎన్టీఆర్ సతీమణి అయిన లక్ష్మీపార్వతి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.

ఎన్టీఆరే నా ప్రాణం అని చెప్పే లక్ష్మీ పార్వతి ఇప్పటి వరకూ ఈ పేరు మార్పు అంశాన్ని ఖండించకపోవడంతో ఆమెకు అన్నింటికన్నా పదవే ముఖ్యమా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను తెలుగు, సంస్కృత అకాడమీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ పదవి ఆమెను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినందున ఆమె ఎన్టీఆర్ పేరు మార్చినా నోరు మెదపడం లేదని అంటున్నారు.

Related posts

12 బుడతడు పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో డేటా సైంటిస్టు

Satyam NEWS

ముస్లిం సోదరుల అజ్మీర్ యాత్ర సఫలీకృతం కావాలి

Bhavani

ఎనాలసిస్: నీరస పడ్డ దేశానికి మళ్లీ మోడీ టానిక్

Satyam NEWS

Leave a Comment