ఖమ్మం నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఖమ్మం మణిహారం అయిన లకారం ట్యాంక్ బండ్ పై ప్రారంభించారు. NCC, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ సంయుక్తంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం చెత్త సేకరణ వ్యాన్లు-5, కాంపాక్టర్ ను మంత్రి ప్రారంభించారు.
ఇదే స్ఫూర్తితో ఖమ్మంను క్లీన్ అండ్ గ్రీన్ ఖమ్మంగా తీర్చిదిద్దటంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.