రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 55వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేపట్టారు. వెలగపూడిలో రిలే దీక్షలు 55వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు 24గంటల పాటు దీక్షలో ఉన్నారు.