30.7 C
Hyderabad
May 5, 2024 06: 10 AM
Slider చిత్తూరు

తిరుపతిలో ప్రమాదకర క్లీనికల్ వేస్ట్ ను తక్షణమే తొలగించాలి

#NaveenkumarReddy

తిరుపతిలోని కోవిడ్ హాస్పిటల్స్, వసతి సముదాయలలో వైరస్ సోకిన పేషెంట్లు వినియోగించిన మాస్కులు, ఇంజక్షన్లు,శానిటైజర్ లాంటి వ్యర్థ పదార్థాలను రోడ్లపై ఎక్కువ సమయం ఉంచకుండా వెంటనే తొలగించేలా నగరపాలక సంస్థ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

తిరుపతి నగరంలో ప్రజల నివాసాల మధ్య వున్న TTD వసతి సముదాయాలతో పాటు చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చడం కరోనా వైరస్ తీవ్రతకు నిదర్శనమని ఆయన అన్నారు.

నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు,ఇతర శాఖల లోని సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా నాణ్యమైన గ్లౌజ్ లు,మాస్కులు,శానిటైజర్ లు విటమిన్ మాత్రలు,ప్రత్యేక వైద్య పరీక్షల ఏర్పాటుపై కార్పొరేషన్ మేయర్ సభ్యులు అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు.

కరోనా వైరస్ మొదటిసారి వచ్చినప్పుడు ఏ వీధిలోనైనా ఎవరికైనా పాజిటివ్ ఉంటే అక్కడ బ్లీచింగ్ వేయడం,శానిటేషన్ చేయడం,పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది కానీ సెకండ్ వేవ్ లో నగరపాలక సంస్థ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు  చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కనపడటం లేదని ఆయన తెలిపారు.

Related posts

గద్వాలలో శ్రీ రాఘవేంద్ర స్వామి 428 వ వర్ధంతి

Satyam NEWS

ములుగు జిల్లా బీసీ సెల్ ఇన్చార్జిగా సురేందర్

Satyam NEWS

ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెస్ట్ ఇంజనీర్లకు సన్మానం

Satyam NEWS

Leave a Comment