37.2 C
Hyderabad
April 26, 2024 22: 29 PM
Slider వరంగల్

ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెస్ట్ ఇంజనీర్లకు సన్మానం

#enjaneersday

హన్మకొండలోని శాయంపేట  లయన్ క్లబ్ భవన్ లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320F ఆధ్వర్యంలో నేడు ఇంజనీరింగ్ డే జరిగింది. ఈ సందర్భంగా లయన్ బాలనర్సయ్య అధ్యక్షతన  65 మంది ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు.

ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇదే కార్యక్రమంలో ఏ. ఆర్. బిల్  టెక్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ యేశ బోయిన అనిల్ యాదవ్, గజర్ల  రంజిత్ సివిల్ ఇంజనీర్లను శాలువా మెమోంటో, సర్టిఫికెట్ తో బెస్ట్ ఇంజనీర్ల గా ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి మొదటి కారణం ఇంజనీర్లు అని అన్నారు. అలాంటి వారిని లైన్స్ క్లబ్ వారు ఒకే దగ్గర చేర్చి సన్మానించడం ఎంత గొప్ప విషయమని అన్నారు.

లయన్స్ జిల్లా గవర్నర్ మాట్లాడుతూ ఇంజనీర్ల గొప్పతనం  వారి సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం సన్మానించడం ఎంతో ఆనందదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో  320f ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్  గవర్నర్ లయన్  పరశురాములు, సెకండ్ వైస్  డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్  ఎన్  వెంకటేశ్వరరావు ,పి డి జీ జాన్ బన్నీ, పిడిజి లయన్ పోకల చందర్,

ములుగు లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ చుంచు రమేష్ ఇంటర్నేషనల్ 320ఫ్ లయన్స్  జిల్లా నాయకులు, పలువురు ఇంజనీర్లు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

బీజేపీ తప్పిదం: కాంగ్రెస్ కు కలిసి వస్తున్న కాలం

Satyam NEWS

నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజలకు అందించాలి

Sub Editor 2

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి 50 శాతం తగ్గిస్తున్న సీరం

Sub Editor

Leave a Comment