30.7 C
Hyderabad
April 29, 2024 04: 00 AM
Slider విజయనగరం

శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి బందోబస్తు

#vijayanagaramci

“సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి తో డా.సీఐ వెంకటరావు

ఈ నెలాఖులో ఉత్తరాంధ్ర లోని విజయనగరం లో కొలువు వై ఉన్న శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం జరగనుంది. ఈ నల 30,31తేదీలలో తొలేళ్లు, సిరిమానోత్సవం జరగనుంది. అలాగే ఇప్పటికే మండల దీక్షలు… ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి… విజయనగరం సబ్ డివిజన్ పోలీసులు విస్తృత బందోబస్తు కై సిద్ధమవుతున్నారు.

అందులో భాగంగా..అసలు సిరిమాను ఉత్సాహం… అలాగే పైడితల్లి అమ్మవారి దర్శనానర్ధం..ఎంత మంది బందోబస్తు అవసరం… అసలు… ఏ మేరకు భక్తులు వస్తారు…వాళ్ళు ఏ విధంగా దర్శనానికై వస్తారు….అనే పరిస్థితులను…క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు.. డీఎస్పీ ఆదేశానుసారం… విజయనగరం వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు ఆధ్వర్యంలో ఎస్ఐ రామ్ గణేష్, పీసీ దామోదర్ లు…మూడు లాంతర్లు… అమ్మవారి టెంపుల్ నుంచీ… కోట వరకు అంటే సిరిమాను తిరిగే ప్రదేశాన్ని రాత్రి ఏడుగంటల ప్రాంతంలో నడుచుకుంటూ పరిశీలించారు.

అదే సమయంలో నడిరోడ్డుపై అదీ రాత్రి పూట… నగర రోడ్ పై  వన్ టౌన్ సీఐ పైదల్ అంటే నడుచుకుంటూ కనిపించడంతో నగర ప్రజలలో ఒకింత ఆశ్చర్యం కలిగించింది. సీఐ ఉండగానే కొంతమంది ప్రజలు… మాట్లాడుకోవడాన్ని విన్న సీఐ డా.వెంకటరావు వాళ్లకు వివరించే యత్నం చేశారు. నగరంలో ని కోట నుంచీ వయా మూడు లాంతర్లు, అమ్మవారి కోవెల మీదుగా గంటస్థంభం వరకు నడిచి పరిస్థితి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ కు వచ్చిన “సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి.. ఎందుకీ ఆకస్మిక పరిశీలన అడగడంతో… ఎస్పీ ఆదేశాలు.. డీఎస్పీ సూచనలతో ఒక్క సారి రూట్ పరిశీలించామని సీఐ డా.వెంకటరావు చెప్పారు.

Related posts

అత్యంత వీర విధేయుల పనితీరే బాగాలేదు

Satyam NEWS

దయచేసి ఇక సోనూ సూద్ ను వదిలేయండి

Satyam NEWS

‘క్షీర సాగర మథనం’ గీతం విడుదల చేసిన హరీష్ శంకర్

Satyam NEWS

Leave a Comment