29.7 C
Hyderabad
May 7, 2024 06: 23 AM
Slider రంగారెడ్డి

నిజమైన మహిళా బంధు కేసీఅర్ : ఎమ్మెల్యే బేతి

#uppalmla

నిజమైన మహిళా బంధు సిఎం. కెసిఆర్ అని, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్  భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ వంటివి ఏర్పాటు చేసి మహిళా లోకానికి తోడ్పాటు నిచ్చారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ లు అన్నారు.

సోమవారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిల్కానగర్ డివిజన్ ఉప్పల్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో  కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో  మహిళా బందు రెండవ రోజు సంబరాలు ఘనంగా  నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ గీత,  డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుభద్ర, మహిళా  నాయకులు తో కలసి  ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య  కేంద్రానికి కార్పొరేటర్ గౌరవ  వేతనం నుండి లెడ్ టీ వి. ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి  చేతుల మీదుగా బహూకరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మహిళా సిబ్బందిని, పోలీసు మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్  మాట్లాడుతూ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్  భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ వంటివి ఏర్పాటు చేశారని అన్నారు. వడ్డీలేని రుణాల ద్వారా రాష్ట్రంలో  40.58 లక్షలు మంది మహిళలకు లబ్ధి చేకూరిందని అన్నారు. మహిళలకు ప్రత్యేక పారిశ్రామిక  పార్కులు, ప్రత్యేక విద్యా సంస్థలతో పాటు, రాజకీయ రంగంలోనూ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సౌందర్య లత, సూపర్వైజర్ భోగ ప్రకాష్, గోంగడయ్య, జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి,వేముల సంతోష్ రెడ్డి ,చింతల నరసింహారెడ్డి,

బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, టిఆర్ఎస్ మహిళా నాయకులు సుభద్ర, ఉషరాని, అనసూయ, ఆండాలు, షహనాజ్, సత్యవతి, కనకతార, భాగ్యలక్ష్మి, అంజలి, వసంత,లక్ష్మి, ఉమ, సీనియర్ నాయకులు ఎదుల కొండల్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, మాస శేఖర్, ఎండీ. మహమూద్, రాంచందర్, సందేపల్లి శ్రీనివాస్, అశోక్ చారి, బింగి శ్రీనివాస్, నారాయణ రెడ్డి, శ్రీను నాయక్, అల్లిబిల్లీ మహేందర్,  రామానుజం,జంపని  బాలు గౌడ్, యాదగిరి, పోచన్న, బాలు,సుందర్, రవీందర్ గౌడ్, ఫరూక్, జిల్లాల ప్రవీణ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

అహంకారానికి…ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధంలో ఈటెల గెలుపు

Satyam NEWS

కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ గీతం అంకితం

Satyam NEWS

గుడ్ బై: తమిళనాడుకు వెళ్తున్న కియా మోటార్స్

Satyam NEWS

Leave a Comment